ఈహెచ్ఎస్ అమల్లో రాజీ లేదు : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం పట్ల ఎంతో పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని మహాత్మా జోతిబాఫూలే ప్రజాభవన్‌లో ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ట్రస్ట్ బోర్డు (ఈహెచ్సీటీ) సభ్యులు, ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, డిపెండెంట్ల ఆరోగ్య భద్రత కోసం తీసుకొచ్చిన నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తుందని చెప్పారు. దశాబ్దాలుగా ఉద్యోగులు ఎదురుచూ స్తున్న సమస్యను మానవీయ కోణంలో పరిష్కరిం చాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. ప్రభుత్వంలో పనిచే స్తున్న ఉద్యోగులంతా తమవారేననీ, వారు ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, డిపెండెంట్లు గానీ అనారోగ్యానికి గురైనప్పుడు ఆర్థిక, మానసిక ఇబ్బందులకు గురికాకూడదన్న ఉన్నతమైన ఆశయంతోనే అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకం రూపకల్పన, విధివిధానాల విషయంలో ఉద్యోగ సంఘాలతో అనేకసార్లు సమావేశాలు నిర్వహించి, వారి సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని వివరించారు. ఉద్యోగుల గురించి మానవీయ కోణంలో ప్రజాప్రభుత్వం తెచ్చిన పథకాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు.
ఆరోగ్య కార్డుల జారీని వేగవంతం చేయాలి
ఈహెచ్ఎస్ పథకంలో ఇప్పటికే 354 ప్రయివేట్ ఆస్పత్రులు ఉన్నాయనీ, మరికొన్ని ఆస్పత్రులను డీమ్డ్ ఎంప్యానెల్డ్ విధానంలో చేర్చామని భట్టి చెప్పారు. ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి, పథకం సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఈ పథకాన్ని ఎవరూ అషామాషీగా తీసుకోవద్దని ఉన్నతాధికారులను కోరారు. ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించిన ఈ అంశంపై ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. ఈ పథకాన్ని అమలు చేయాలన్న స్పష్టమైన సంకల్పంతో ప్రజాప్రభుత్వం ఉందని చెప్పారు. ఉద్యోగుల సమస్యలను పదేండ్లుగా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య పథకాన్ని అమల్లోకి తెచ్చిందని గుర్తు చేశారు. ఉద్యోగుల ఆరోగ్యం, వారి కుటుంబాల సంక్షేమం విషయంలో ఈ ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో ఉందన్నారు. ఆరోగ్య కార్డుల పథకాన్ని విజయ వంతం చేయడంలో అధికారులు, ఉద్యోగ సంఘా ల నాయకులు బాధ్యతను సమర్థంగా నిర్వర్తిం చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ సంజయ్ జాజు, జీఏడీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ మహేష్ దత్ ఎక్కా, వైద్యా రోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టీనా జెడ్ చోంగ్తు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఈహచ్ఎస్ సీఈఓ హనుమంతు, ఉద్యోగ సంఘాల నాయ కులు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, వి లచ్చిరెడ్డి, ఎ వెంకట్, పుల్గం దామోదర్‌రెడ్డి, జి సదానందంగౌడ్, బి శ్యామ్, ముజీబ్ హుస్సేనీ, పి మధుసూదన్‌రెడ్డి, కటకం రమేశ్, పి కృష్ణమూర్తి, పి వెంకట్‌రెడ్డి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



