Monday, September 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమాజ నిర్మాణంలో 
ఉపాధ్యాయుల పాత్ర కీలకం

సమాజ నిర్మాణంలో 
ఉపాధ్యాయుల పాత్ర కీలకం

- Advertisement -


అనురాగ్ యూనివర్సిటీ డైరెక్టర్
 డాక్టర్ మహీపతి శ్రీనివాసరావు,
తెలంగాణ బాలోత్సవ్‌ ‌ఆధ్వర్యంలో
 ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-అంబర్‌పేట

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పలువురు వక్తలు కొనియాడారు. తెలంగాణ బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌ నారాయణగూడలోని భారత్ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనురాగ్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ మహీపతి శ్రీనివాసరావు, ఓయాసిస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ జీఎస్. పరంజ్యోతి, బాలోత్సవం కమిటీ ప్రధాన కార్యదర్శి ఎస్. సోమయ్య పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థి ప్రత్యేక వ్యక్తిత్వం, భిన్నమైన ఆసక్తులు, సామర్థ్యాలు కలిగి ఉంటారని తెలిపారు. వారిలోని ప్రతిభను గుర్తించి సరైన మార్గంలో నడిపించే శక్తి ఉపాధ్యాయులకే ఉందని అన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని పేర్కొంటూ, ఉపాధ్యాయులు కేవలం పాఠాలు బోధించడానికే పరిమితం కాకుండా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శకులుగా, సమాజాన్ని తీర్చిదిద్దే శిల్పులుగా నిలుస్తున్నారని ప్రశంసించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, చర్చావేదిక, నాటికలు తదితర సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు మస్తాన్, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -