– వైదొలగిన వివేక్ రామస్వామి
వాషింగ్టన్: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి వైదొలగుతున్నట్టు ఇండియన్ అమెరికన్, ప్రముఖ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకే తన మద్దతు వుంటుందని స్పష్టం చేశారు. ఐయోవా ప్రైమరీ ఎన్నికల్లో నిరాశాజనకమైన రీతిలో నాల్గవ స్థానంలో నిలబడిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ పోటీలో ఇక ముందుకు వెళ్లే అవకాశం లేదని భావించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రామ స్వామి తెలిపారు.