జర్మనీలో రైతులు, రైల్వే కార్మికుల నిరసల హోరు

బెర్లిన్‌: జర్మనీలో రైల్వే డ్రైవర్లు పెద్ద ఎత్తున సమ్మెకు దిగటంతో దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ అతలాకుత లమవుతున్నది. ఇది చాలా రోజులు కొనసాగేలా ఉందని భావిస్తున్నారు. ఈ పరిస్థితి డిసెంబరు నుంచి రైతులు చేస్తున్న నిరసన ప్రదర్శనలతో మరింతగా క్షీణించింది. అక్కడ రైతులు సైతం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రోడ్లను దిగ్బంధం చేస్తూ తమ నిరసన తెలుపుతున్నారు. జీడీఎల్‌ కార్మిక సంఘం సమ్మె చేయటంవల్ల చాలా రైల్లు రద్దయ్యా యని, అందువలన ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవా లని డీబీ రైలు సంస్థ ఒక ప్రకటనలో కోరింది. ఈ సమ్మె పర్యవసానంగా 80శాతం రైలు ప్రయాణ సేవలు రద్దయ్యాయి. ఎల్లవేళలా ప్రయాణికుల తో కళకళలాడే బెర్లిన్‌, హామ్‌ బర్గ్‌తో సహా జర్మన్‌ నగరాల్లోని రైల్వే స్టేషన్లు ప్రయాణికులులేక వెలవెలబోయాయి. కార్మికుల న్యాయమైన కోర్కెలను డిబి కంపెనీ పట్టించుకోకపోవటం వల్లనే సమ్మెకు పిలుపునివ్వవలసి వచ్చిందని జీడీఎల్‌ కార్మిక సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. పని గంట లను 38 నుంచి 35కు తగ్గించాలని, ద్రవ్యోల్బణంవల్ల పరిహారంగా ఇవ్వ నున్న 3000 యూరోలకు అదనంగా 555 యూరోలను ఇవ్వాలని జీడీఎల్‌ డిమాండ్‌ చేస్తోంది. ఒకవైపు రైలు సమ్మె కొనసాగు తుండగా అక్కడి రైతాంగం వారం రోజులపాటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. జర్మన్‌ ప్రభుత్వం వ్యవ సాయ రంగానికి ఇస్తున్న డీజిల్‌ సబ్సిడీ, పన్ను రాయితీలను తగ్గించా లని చేసిన నిర్ణయంవల్ల తాము తీవ్రంగా నష్టపోతామని రైతాంగం భావిస్తోంది. వ్యవసాయ రంగానికి ఇస్తున్న రాయితీలను తగ్గించటానికి కారణం జర్మనీ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున నిధులను అందజేయ టమే. ఉక్రెయిన్‌ రష్యాపైన గెలవటం కోసం పశ్చిమ దేశాలు 100ల కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి. ఉక్రెయిన్‌కు అంత మొత్తంలో నిధులను సరఫరా చేస్తున్న దేశాల్లో అమెరికా తరువాత స్థానం జర్మనీదే. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ఉక్రెయిన్‌కు అందిస్తున్న సహాయంలో సగ భాగం ఒక్క జర్మనీ నుంచే వస్తోందని గత వారం జర్మన్‌ ఆర్థిక మంత్రి క్రిస్టియన్‌ లిండ్‌ నర్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. అలా ఉక్రెయిన్‌కు జర్మనీ చేసిన సహాయం 23బిల్లియన్‌ డాలర్ల దాకా ఉందని కియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ద వరల్డ్‌ ఎకానమీ(ఐఎఫ్‌డబ్యూ) అంచ నా వేసింది. పర్యవసానంగా ఆ దేశ చాన్స్‌లర్‌ స్కోల్జ్‌ ప్రజామోదం రేటు ఘోరంగా పడిపోయింది. జర్మనీ లో 64శాతం ప్రజలు స్కోల్జ్‌ని తన పదవి నుంచి వైదొలగాలని కోరుతున్నారు.

Spread the love