Monday, September 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ వెయ్యిరోజుల దగాకోరు పాలన

కాంగ్రెస్ వెయ్యిరోజుల దగాకోరు పాలన

- Advertisement -

ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని ఎంపీడీఓలకు బీఆర్‌ఎస్‌ నాయకుల వినతి
నవతెలంగాణ – జుక్కల్‌
కాంగ్రెస్ వెయ్యిరోజులు దగా కోరు పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా జుక్కల్ నియోజకవర్గంలో బీఐర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఆయా మండలాల ఎంపీడీఓ కార్యాలయాల వద్ద నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను చేయాలని, నెరవేరని వాగ్దానాలపై దరఖాస్తు పత్రాలను ఎంపీడీఓలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డోంగ్లీ మండల కేంద్రంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొని, ప్రజల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పాలన కొనసాగిస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జుక్కల్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి ప్రజావాణిలో దరఖాస్తు పత్రాలను సమర్పించారు. ప్రజల పక్షాన నిలబడి, ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -