Monday, September 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్పీకర్ గడ్డం ప్రసాద్ పై మధుసూదన్ రావు వ్యాఖ్యలు సరికాదు

స్పీకర్ గడ్డం ప్రసాద్ పై మధుసూదన్ రావు వ్యాఖ్యలు సరికాదు

- Advertisement -

ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ పై ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని,అట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాజ్యాంగ బద్ధమైన శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్న  దళిత నాయకుడిని ఉద్దేశించి ఇలాంటి అహంకారపూరితమైన,బాధ్యత రహితమైన మాటలు మాట్లాడటం తాతా మధుసూదన్ రావు కుల దురహంకారానికి, అపరిపక్వతకు నిదర్శనమన్నారు.

దళిత వర్గానికి చెందిన అసెంబ్లీ స్పీకర్ గా రాజ్యాంగం కల్పించిన ఉన్నత పదవిలో ఉండటాన్ని జీర్ణించుకోని కేసీఆర్ అసెంబ్లీకి రాకుండ, అసెంబ్లీకి వచ్చిన  అగ్రకుల నాయకులు,అగ్రకుల మదంతో ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.తాతా మధుసూదన్ రావు సభ్యత్వం తొలగించాలని అలాగే ఎస్సి,ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేసి అతని ఎమ్మెల్సి సభ్యత్వాన్ని తొలగించాలని,వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని,స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి బేషరతుగా బహిరంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.భవిష్యత్ లో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు పునరావృతమైతే ప్రజల పక్షాన తగిన బుద్ధి చెబుతామని, చట్టపరిధిలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -