Monday, September 7, 2026
E-PAPER
Homeఖమ్మంరైతుల కోరిక మేరకు సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు విడుదల

రైతుల కోరిక మేరకు సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు విడుదల

- Advertisement -

– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ-సత్తుపల్లి 

సాగర్ ఆయకట్టు పరిధిలో సాగవుతున్న పంటలు ఎండిపోకుండా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల విజ్ఞప్తి మేరకు వైరా, లంకసాగర్ రిజర్వాయర్ల పరిధిలోని సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలను విడుదల చేసినట్లు వెల్లడించారు. నిన్న తల్లాడ మండలంలో పర్యటించిన సందర్భంగా పంటలకు నీరు అత్యవసరమని, సకాలంలో అందకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన మంత్రి వెంటనే స్పందించి, జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నీటి అవసరాలను అంచనా వేయాలని ఆదేశించారు.

అనంతరం నేడు అసెంబ్లీలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ప్రత్యేకంగా బేటీ ఆయిన మంత్రి తుమ్మల విజ్ఞప్తికి ఇరిగేషన్ మంత్రి సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో, సోమవారం మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. దీంతో నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. పంటలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని తుమ్మల ఆదేశించారు. ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అండగా ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. నీటిని తక్షణమే విడుదల చేయించినందుకు గాను ఆయకట్టు పరిధిలోని రైతులు ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -