Monday, September 7, 2026
E-PAPER
Homeసినిమాహృదయాలను దోచుకునే ‘ఎపిక్‌’

హృదయాలను దోచుకునే ‘ఎపిక్‌’

- Advertisement -

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. నైన్టీస్‌ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రంతో వెండితెరకు దర్శ కుడిగా పరిచయం అవు తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 11న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో దర్శ కుడు ఆదిత్య హాసన్ మీడియాతో ముచ్చటించారు.
షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసిన తరువాత కలర్స్ స్వాతితో ‘టీచర్’ అనే సినిమా చేశాను. నవీన్ మేడా రం, అభిషేక్ నామా నిర్మించిన ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. తరువాత మా నాన్న నిజ జీవితం ఆధారంగా నైన్టీస్‌ కథ రాసు కున్నాను. ఈటీవీ విన్ సాయి, నితిన్ వల్ల ఆ వెబ్ సిరీస్ తెరపైకి వచ్చింది.
ఈ సినిమా కథలో కూడా నిజ జీవిత సంఘటనల స్ఫూర్తి ఖచ్చి తంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. నైన్లీస్‌ సిరీస్ కు ఇది సీక్వెల్. అందులోని తమ్ముడి పాత్రకు సంబంధించిన జీవితంలోని ఒక భాగం ఎపిక్ కథగా ఉంటుంది. ఆ తర్వాత అన్న జీవితాన్ని ఒక కథగా, అక్క జీవితాన్ని ఒక కథగా చూపించే ఆలోచన కూడా ఉంది.
‘బేబీ’ కాంబో కమర్షియల్ గా హెల్ప్ అవుతుందని నిర్మాత నాగవంశీ అన్నారు. ఆయన అన్నప్పుడు అర్థం కాలేదు కానీ, తర్వాత సినిమాపై వచ్చిన హైప్ చూశాక ఆయన చెప్పింది కరెక్ట్ అని అర్థమైంది. అలా ‘బేబీ’ తరువాత ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా దీంతో రాబోతున్నారు. వీరిద్దరి నటన అందర్నీ మెస్మరైజ్‌ చేస్తుందని కచ్చితంగా చెప్పగలను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -