జెజె ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా మహేష్ కుమార్ సంక, భగవాన్ నిర్మిస్తున్న సినిమా ‘# ఎల్ యుబి’. మణికంఠ పెదమల్లు దర్శకునిగా పరిచయం అవుతున్నారు.
అలాగే ఈ చిత్రం ద్వారా పవన్ కేసరి, ప్రాముఖ్య హీరో, హీరోయిన్ గా పరిచయం అవుతుండగా, అభితేజ్, జెడివి ప్రసాద్, మల్లిక లెల్ల, సాయికిరణ్, రోమాంచకం ఫేమ్ మధు, హారిక, భాను ప్రకాష్ కడియాల, మోత రాజేందర్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు.
రచయిత బివిఎస్ రవి ఈ చిత్రానికి క్లాప్ చేయగా, హనుమాన్ చిత్ర నిర్మాత చైతన్య రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి షాట్‌కి చిత్ర దర్శకుడు మణికంఠ దర్శకత్వం చేయగా, స్క్రిప్టును క్రేజీ కల్యాణం నిర్మాత బి జగన్ మోహన్ రెడ్డి , బివిఎస్ రవి అందజేశారు. ఈ ఈవెంట్ కు హాజరైన సంబరాల ఏటిగట్టు చిత్ర దర్శకుడు రోహిత్ కెపి, దర్శకుడు సముద్ర, నిర్మాతలు లగడపాటి శ్రీనివాసరావు, శ్రీకాంత్ ఈ చిత్ర యూనిట్ కు తమ బెస్ట్ విషెస్ తెలిపారు.
పవన్ కేసరి మాట్లాడుతూ, ‘రోమ్ కోమ్, కామెడీ, లవ్ తో కూడిన ఎమోషన్ ఉన్న చిత్రం’ అని అన్నారు. ‘ఇది నా తొలి చిత్రం. సినిమాలో నా పాత్ర చాలా బలంగా ఉంటుంది. సినిమా టీం అంతా కొత్త వారే’ అని నటి ప్రాముఖ్య చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ, ‘ఒక మంచి కథతో సినిమా చేయాలి అనే ప్యాషన్ తో చిత్ర పరిశ్రమకు వచ్చాము. ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది’ అని తెలిపారు. ‘ఈ సినిమా ఎమోషన్స్ తో ఒక రొమాంటిక్ డ్రామాగా ఉండబోతుంది. ఇలాంటి ఓ మంచి కథతో తీస్తున్న ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన మా నిర్మాతకి ధన్యవాదాలు’ అని దర్శకుడు మణికంఠ చెప్పారు.
ఆద్యంతం వినూత్నంగా సాగే కథ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



