Tuesday, September 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇండొనేషియాలో చిక్కుబడిన లక్షలాది ప్రయాణికులు

ఇండొనేషియాలో చిక్కుబడిన లక్షలాది ప్రయాణికులు

- Advertisement -

జకార్తా : ఇండొనేషియాలో అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా 2,70,000 మంది ప్రయాణికులు విమానాశ్రయాలలో చిక్కుబడిపోయారు. రెండు వేలకు పైగా విమానాలు నిలిచిపోవడం, విమానాశ్రయాలు వరుసగా రెండో రోజు కూడా కార్యకలాపాలను నిలిపివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రాజధాని జకార్తాకు 150 కిలోమీటర్ల దూరంలోని అనక్‌ క్రాకటౌ అగ్నిపర్వతం శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత బద్దలైన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున లావా ఎగసిపడుతూ రాజధానిని, లాంపుంగ్‌ రాష్ట్రాన్ని బూడడిదతో ముంచెత్తింది. గగనతలంలో అగ్నిపర్వతం బూడిదను గమనించిన జకార్తాలోని సుకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మరో మూడు ఎయిర్‌పోర్టులు తమ కార్యకలాపాలను సోమవారం సాయంత్రం వరకూ నిలిపివేశాయి. పాఠశాలలు తమ విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. కొన్ని షిప్పింగ్‌ కార్యకలాపాలకు కూడా అంతరాయం ఏర్పడింది. సుకర్నో-హట్టా విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ప్రయాణికుల్లో కొందరు తమ టిక్కెట్‌ ఛార్జీని వాపసు చేయాలని కోరగా మరికొందరు తమ ప్రయాణాలు ఎప్పుడో తెలుసుకునేందుకు ప్రయత్నించడంతో పొడవైన క్యూలు ఏర్పడ్డాయి. కొన్ని విమానాల షెడ్యూల్‌ను పదే పదే మార్చడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -