Tuesday, September 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంప్రతిస్పందన బాధాకరంగా ఉంటుంది

ప్రతిస్పందన బాధాకరంగా ఉంటుంది

- Advertisement -

అమెరికా దాడులపై ఇరాన్‌ హెచ్చరిక
టెహ్రాన్‌ :
అమెరికా ఆంక్షల కారణంగా ఎదురైన సమస్యలను పరిష్కరించుకు నేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని ఇరాన్‌ తెలిపింది. తనపై మరిన్ని దాడులు జరిపితే ‘బాధాకరమైన ప్రతిస్పం దన’ తప్పదని హెచ్చరించింది. చమురు ట్యాంకర్లపై అమెరికా జరిపిన తాజా దాడుల నేపథ్యంలో ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాఖర్‌ ఖలీబఫ్‌ మాట్లాడుతూ ఆట నియమాలు మారిపోయాయని మరీ ఆలస్యం కాకముందే అమెరికా గ్రహించా లని వ్యాఖ్యానించారు. ఇకపై ఇరాన్‌ ప్రయో జనాలు, భద్రతపై జరిగే ఏ దాడికైనా వేగవంతమైన, తీవ్రమైన, బాధాకరమైన ప్రతిస్పందన ఉంటుందని తన టెలిగ్రామ్‌ ఛానల్‌లో ప్రచురించిన ప్రసంగంలో చెప్పారు. అమెరికాతో సైనిక పోరాటం జరపడంతో పాటు ప్రధానంగా ఉత్పత్తి, ప్రజల జీవనోపాధి కోసం తాము పోరు సాగించాల్సి ఉంటుందని అన్నారు. కరెన్సీలో తీవ్రమైన హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మార్కెట్‌ నిర్వహణ వంటివి తమ ముందు ఉన్న ప్రధాన సవాళ్లని తెలిపారు. ఇరానీయులు కష్టాలను సహించ గలరని, కానీ దుర్వినియోగాన్ని సహించబోరని, ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటారని చెప్పారు.
రాబోయే రోజులలో హార్ముజ్‌ జలసంధి వెలుపల ఆంక్షలతో కూడిన మండలాన్ని ప్రకటిస్తామని ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శి మొహ్‌సేన్‌ రెజాయి తెలిపారు. ఈ మండలంలో గల్ఫ్‌లోని ప్రాంతాలు కూడా ఉంటాయని, అందులో ప్రవేశించే ఏ నౌకనైనా ఆంక్షల జాబితాలో చేరుస్తామని చెప్పారు. కాగా అమెరికా ఆర్థిక ఒత్తిడికి సంస్కరణలతో ప్రతిస్పందించాలని అనుకుంటున్నామని ఇరాన్‌ ఆర్థిక మంత్రి అలీ మదానీజాదే తెలిపారు. ఆంక్షల కారణంగా తమ వైఖరి మారబోదని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -