•ఫ్యాషన్ శిక్షణ కేంద్రం ప్రారంభంలో సర్పంచ్ కొండ మంజుల- శ్రీనివాస్
నవతెలంగాణ – రామగిరి
స్వయం సహాయక సంఘాల్లో మహిళలు వ్యాపార వేత్తలుగా చేయాలనే లక్ష్యంతో మంత్రి శ్రీధర్ బాబు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఆదివారం రామగిరి మండలం, చందనాపూర్ గ్రామంలో , ఫ్యాషన్ శిక్షణ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ కొండా మంజులా – శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే మంత్రి శ్రీధర్ బాబు ఆశయం అని పేర్కొన్నారు. మహిళా సంఘాలు అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్నాయని, అదేవిధంగా స్వయంగా మహిళలు శిక్షణ పూర్తి చేసిన అనంతరం వ్యాపార వేత్తలుగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో, ఉప సర్పంచ్ చిగురు రజిత- రామ్ చందర్,వార్డు సభ్యులు,నాయకులు పేరాల మహేశ్వర్ రావు, సిఓ. రాజేశ్వరి. బాపు, మహిళలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మహిళలు వ్యాపారవేత్తలుగా మారడమే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



