రేపు నవోదయ అర్హత పరీక్ష..

– పరీక్షార్ధులు 86 మంది…
నవతెలంగాణ – అశ్వారావుపేట: నవోదయ అర్హత పరీక్ష శనివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) లో నిర్వహించబడుతుంది అని ఈ పరీక్ష సూపరింటెండెంట్,స్థానిక ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత శుక్రవారం తెలిపారు.పరీక్ష ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతుందని,పరీక్ష అర్హులు 10.45 కు పరీక్ష హాలుకు అనుమతించ బడుతుంది అని అన్నారు.విద్యార్థులు తమ వెంట పరీక్ష హాల్ టికెట్,ఆధార్ కార్డు జిరాక్స్ తెచ్చుకోవాలి అని తెలిపారు.మొత్తం 86 మంది పరీక్షలు రాస్తారని అన్నారు.

Spread the love