నవతెలంగాణ-మెండోరా : మండల మహిళా సమాఖ్య కేంద్రం లో వివోఏ సమీక్ష సమావేశానికి అడిషనల్ డి ఆర్ డి ఓ మధు సుధన్, మరియు డిపిఎం మారుతి రావడం జరిగింది. ఈ సమావేశంలో SERP అంశాలపై సమీక్ష చేయడం జరిగింది. అంతే కాకుండా ఈ నెలాఖరు వరకు బ్యాంకు లింకేజీ, శ్రీనిధి లక్ష్యాలను 100% సాధించాలని ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా వివోఏ లకు ఐడి కార్డులను అదనపు డి ఆర్ డి ఓ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఇట్టి సమీక్ష సమావేశానికి ఏపీఎం విక్రమ్ రెడ్డి , సీ బి ఓ ఆడిటర్ మురళి , మండల సమాఖ్యా సిబ్బంది,అందరూ వివోఏలు హాజరు కావడం జరిగింది.