నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని సీతారాంపురం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేల్పుల మల్లయ్య తండ్రి వేల్పుల భయ్యలు మృతి చెందారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ఎదల యాదవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ హెచ్ వెంకటేశ్వర్లు శనివారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భయల్ కుటుంబం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేసిందని అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని చెప్పారు. భయలు మృతి చెందడం బాధాకరమని అన్నారు. కుటుంబసభ్యులు అధైర్యపడొద్దనీ, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్, మునిగల వీడు, రావిరాల, బంజర, బ్రాహ్మణ కొత్తపల్లి, గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు, ఈసంపల్లి వెంకటేష్ ,బండపల్లి కృష్ణ, బొమ్మాోజు అనిల్, పిట్టల మురళి,బ్రాహ్మణకొత్తపల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ దర్శనం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



