Wednesday, April 22, 2026
E-PAPER
Homeజిల్లాలుడిపోల వద్ద భారీ బందోబస్తు

డిపోల వద్ద భారీ బందోబస్తు

- Advertisement -

నవతెలంగాణ–కుషాయిగూడ: ఆర్టీసీ పరిరక్షణతో పాటు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. కార్మికులు సమ్మెలోకి దిగడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.డిపోల ఎదుట కార్మికులు నిరసనలు కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రైవేటు బస్సులను అడ్డుకునే ప్రయత్నాలు జరగడంతో పోలీసులు అప్రమత్తమై డిపోల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
సమ్మె ప్రభావంతో కుషాయిగూడ డిపో పరిధిలో నడిచే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్, ఉప్పల్, ఘట్కేసర్, కోటి, మెహిదీపట్నం, కీసర, అంకిరెడ్డిపల్లె, బోడుప్పల్, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాలకు వెళ్లే రవాణా వ్యవస్థ దెబ్బతింది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు.

ప్ర‌యివేట్ డ్రైవర్ల సంఘీభావం
కుషాయిగూడలో ప్ర‌యివేట్ బస్సు డ్రైవర్లు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. తోటి కార్మికులు సమ్మెలో ఉన్నప్పుడు తాము బస్సులు నడపలేమని స్పష్టం చేశారు. సమ్మె శిబిరాలకు వెళ్లి తమ సంఘీభావాన్ని తెలిపారు.

oplus_2

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -