సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-సంగారెడ్డి
నిర్బంధానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 16న జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరసన దీక్షలు జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. ఆదివారం సంగారెడ్డి లోని సుందరయ్య భవన్ లో సీఐటీయూ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ.. కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, ప్రజాస్వామిక పద్ధతుల్లో ఆందోళన పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతరహితంగా వ్యవహరిస్తూ పోలీసులతో పోరాటాలను అంచివేస్తోందన్నారు. కార్యక్రమాల్లో పాల్గొనకుండా ముందస్తు అరెస్టులు, గృహ నిర్మాంధాలకు పాల్పడటం సరైంది కాదన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని కార్మికులు పోరాడుతుంటే ప్రభుత్వం నిర్బంధాలకు పాల్పడుతోందనీ, ప్రజాస్వామ్య హక్కులను హరిస్తూ కార్మిక వర్గ పోరాటాలను అణిచివేసే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఈనెల 16న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో వేలాదిమంది కార్మికులతో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. దీక్షలలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి. మల్లేష్, జి. సాయిలు నాయకులు మాణిక్, పాండురంగారెడ్డి, బాగా రెడ్డి, మంగ, యాదగిరి, విద్యాసాగర్, మైపాల్, నాగేశ్వరరావు, ప్రవీణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక వర్గ పోరాటాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



