Sunday, September 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘాటెక్కిన ఉల్లి ధర

ఘాటెక్కిన ఉల్లి ధర

- Advertisement -

కిలోకు రూ.70
ఆందోళనలో సామాన్యులు
నవతెలంగాణ – మల్హర్ రావు

ఉల్లి సీజను ఏప్రిల్, మే మాసాల్లో ధర క్వింటాలు కనిష్టంగా రూ.650లకు పరిమితమైంది. పంటను విక్రయించిన రైతులకు కనీసం ట్రాక్టర్, ఆటో రవాణ చార్జీలు కూడా సరిగ్గా రాలేదు. పంటను సాగు చేసిన రైతులకు ధర దక్కక తీవ్రంగా నష్టపోయారు. రైతులు పంటనంతా విక్రయించాక ఇప్పుడు ఉల్లి ధర ఘాటెక్కింది. రిటైల్ మార్కెట్లో కిలోకు ఏకంగా రూ.70ల నుంచి రూ.80కి చేరింది. అంటే క్వింటాలు రూ.7 వేలు రూ.8వేలు అన్నట్టు. అప్పుడు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతే.. ఇప్పుడు అడ్డగోలుగా పెరిగిన ధరకు వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఉల్లిగడ్డను కోయకుండానే సామ్యాడిని కంట నీరు పెట్టిస్తోంది. కాగా, రెండు నెలల క్రితం రిటైల్ మార్కెట్లో కిలోకు రూ.25వరకు ఉండేది. ఇప్పుడు ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువైంది.

వినియోగదారుల జేబుకు చిల్లు..
ప్రస్తుతం ఉల్లిగడ్డ ధర భారీగా పెరగడంతో సామాన్యులు దీని వాడకాన్ని క్రమంగా తగ్గిస్తున్నారు. ప్రతీ వంటకంలో ఉల్లి తప్పనిసరిగా వాడుకునే అలవాటు ఉంటుంది. ఒక్కో కుటుంబం నెలకు కనీసం ఐదు కిలోల నుంచి పది కిలోల వరకు ఉల్లి వాడకం ఉంటుందని అంచనా.. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లలో ఉల్లిగడ్డలను ఇవ్వడం క్రమంగా తగ్గిస్తున్నారు. ఉల్లి బదులుగా కీరాతో సరిపెడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -