కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని ఏకైక డిమాండ్ తో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులందరూ సమిష్టిగా కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్ వద్దు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వి దత్త హరి మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ లో మొత్తం ఖాళీలు 66 అసిస్టెంట్ ప్రొఫెసర్ లు, ప్రస్తుతం పని చేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉపాధ్యాయులు 53 మంది ఉన్నారని, ప్రభుత్వం ఈ 53 మందిని రెగ్యులరైజ్ చేసిన మిగిలిన 11 పోస్టులు ఖాళీ ఉంటాయని దీంతో ప్రభుత్వానికి పెద్దగా భారం పడదన్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ లో 53 మంది మంజురైన పోస్ట్ లోనే ఉన్నారని తెలిపారు. అందరూ రోస్టర్ పాయింట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ యూజీసీ మామ్స్ రూల్స్ ప్రకారం సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారని, దాదాపుగా అందరికీ పీహెచ్డీ, నెట్, స్ట్రెక్టు క్వాలిఫై, హైలీ క్వాలిఫై అయినటువంటి ఉపాధ్యాయులు యూనివర్సిటీ లో విద్య బోధన చేస్తున్నారన్నారు. ప్రస్తుతం పని చేస్తున్నటువంటి ఉపాధ్యాయు లందరూ కూడా ఉన్నత డిగ్రీ అయినటువంటి పీహెచ్డీ పూర్తి చేసిన వారు ఎక్కువ మంది ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం రెగ్యులరైజ్ కోసం యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పూర్తి డీటెయిల్స్ అన్ని సర్టిఫికెట్స్, ఎస్ఎస్సి టు పీహెచ్డీ వరకు వెరిఫికేషన్ పూర్తి చేసినట్లు వివరించారు. ఇది కాంట్రాక్ట్ గురించి పూర్తిగా రెగ్యులర్ అవుతారని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరిగిందని, అసెంబ్లీ చివరి సమావేశంలో వీఆర్ఏలను పర్మినెంట్ చేయడం జరిగిందని, కాని గతంలో ముఖ్యమంత్రి కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని,ఇదే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా యూనివర్సిటీ లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.తమందరిది ఏకైక డిమాండ్ రెగ్యులరైజ్ టు సర్వీస్ 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న అధ్యాపకులందర్నీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు డాక్టర్ వి దత్త హరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ కాంటాక్ట్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Spread the love