– అందజేసిన డీజీపీ శివధర్‌రెడ్డి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అధికారులకు, సిబ్బందికి నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) బి. శివధర్ రెడ్డి నగదు బహుమతులను అందజేశారు. రెండు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ‘సెంట్రల్ ఫ్లాగ్ ఫండ్’ నుంచి నగదు పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రథమ విజేతలకు రూ. 20,000, ద్వితీయ విజేతలకు రూ. 15,000, తృతీయ విజేతలకు రూ. 10,000 చొప్పున బహుమతులు ఖరారు చేశారు. విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
క్యాటగిరీ-1 (పీసీ నుంచి ఏఎస్‌ఐ వరకు):
‘పని ప్రదేశాల్లో లింగ వివక్ష’ అనే అంశంపై నిర్వహించిన ఈ విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ బెటాలియన్‌కు చెందిన ధసరి ప్రశాంత్, కావేరి దీపిక ప్రథమ బహుమతులు సాధించారు. కరీంనగర్ పీటీసీకి చెందిన కె. రవికుమార్, ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్‌కు చెందిన ఎ. రాజు ద్వితీయ బహుమతులు… కరీంనగర్ జిల్లా చొప్పదండి పీఎస్‌కు చెందిన పి. స్వర్ణలత, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఎ. శ్రీలత తృతీయ బహుమతులు గెలుచుకున్నారు.
కేటగిరీ-2 (ఎస్‌ఐ ఆపై స్థాయి అధికారులు):
‘అట్టడుగు స్థాయి పోలీసింగ్‌ను బలోపేతం చేయడం’ అనే అంశంపై నిర్వహించిన పోటీల్లో ములుగు జిల్లా ఆర్‌ఐ వెంకట నారాయణ, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డబ్ల్యూపీఎస్ ఎస్‌ఐ వై. మౌనిక ప్రథమ స్థానంలో నిలిచారు. వరంగల్ పీటీసీ ఇన్‌స్పెక్టర్ కె. అశోక్ కుమార్, ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్ ఆర్‌ఎస్‌ఐ ఎన్.వి.ఆర్. చౌదరి ద్వితీయ బహుమతులు… సీఐడీ ఎస్‌ఐ ఖాజా హఫీజున్నీసా బేగం, జోగులాంబ గద్వాల భరోసా కేంద్రం ఎస్‌ఐ బి. తారక తృతీయ బహుమతులకు ఎంపికయ్యారు.ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఐజీపీ గజరావు భూపాల్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విజేతలకు నగదు బహుమతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



