Tuesday, September 15, 2026
E-PAPER
Homeబీజినెస్ఏషియన్ గేమ్స్ 2026లో ప్రాతినిధ్యంవహించనున్న ఒలంపియన్ ప్రణతి నాయక్ 

ఏషియన్ గేమ్స్ 2026లో ప్రాతినిధ్యంవహించనున్న ఒలంపియన్ ప్రణతి నాయక్ 

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : భువనేశ్వర్ లో ఒడిషా AM/NS  ఇండియా జిమ్నాస్టిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ ( ఒడిషా AM/NS GHPC) లో శిక్షణ పొందుతున్న ఒలంపియన్ ప్రణతి నాయక్ సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు ఐచి-నగోయ, జపాన్ లో జరిగే  20వ ఏషియన్ గేమ్స్ 2026లో ప్రాతినిధ్యంవహించడానికి ఎంపిక చేయబడింది.

ఏషియన్ గేమ్స్ కోసం ఎంపిక చేయబడిన ఏకైక ఇండియన్ జిమ్నాస్ట్ ప్రణతి మాత్రమే మరియు ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ లో విమెన్స్ వాల్ట్ మరియు విమెన్స్ ఆల్-అరౌండ్ కార్యకలాపాల్లో పోటీ చేస్తుంది.

ఉజ్ బెకిస్థాన్ లో FIG వరల్డ్ ఛాలెంజ్ కప్ 2026లో విమెన్స్ వాల్ట్ లో రజత పతకం సహా ఆమె కనబరచిన  శక్తివంతమైన ప్రదర్శనలు ఫలితంగా ఆమె ఎంపిక జరిగింది.

అషుతోష్ తెలంగ్, డైరెక్టర్ & వైస్ ప్రెసిడెంట్- HR & అడ్మినిస్ట్రేషన్, AM/NS ఇండియా, ఇలా అన్నారు, “ ఏషియన్ గేమ్స్ కోసం భారతదేశపు ఏకైక జిమ్నాస్ట్ గా ప్రణతి ఎంపిక చేయబడటం అనేది ఒక గణనీయమైన విజయం మరియు ఇది ఆమె సుస్థిరత, క్రమశిక్షణ మరియు దృఢ సంకల్పాన్ని సూచిస్తోంది. ఒడిషా AM/NS ఇండియా జిమ్నాస్టిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ లో, ఉన్నతమైన స్థాయిలో పోటీ చేయడానికి అవసరమైన  శిక్షణ మరియు మద్దతును అథ్లెట్లకు కేటాయించడానికి మేము ప్రాధాన్యతనిస్తాము. ఐచి-నగోయాలో ప్రణతి భారతదేశపు తరపున ప్రాతినిధ్యంవహిస్తున్నందుకు  మేము ఆమెకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము. ”

ప్రణతి టోక్యో 2020 ఒలంపిక్ గేమ్స్ లో భారతదేశం తరపున ప్రాతినిధ్యంవహించింది మరియు జాతీయ మరియు అంతర్జాతీయ పోటీల్లో శక్తివంతమైన పోటీలను నిరంతరంగా అందచేసింది. 2026లో తాష్కెంట్ లో  FIG వరల్డ్ ఛాలెంజ్ కప్ లో ఆమె రజత పతకం మరియు 54వ ఆల్ ఇండియా రైల్వే జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం సాధించడంతో పాటు గ్లాస్ గోలో కామన్వెల్త్ గేమ్స్ లో ఆమె భారతదేశం తరపున ప్రాతినిధ్యంవహించింది.

2025లో, ఆమె ఏషియన్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ షిప్స్ మరియు FIG అప్పరటస్ వరల్డ్ కప్ లో కాంస్యం గెలుచుకుంది మరియు 38వ నేషనల్ గేమ్స్ లో ఒక స్వర్ణం, ఒక రజతం మరియు ఒక కాంస్యం కైవసం చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆమె నేషనల్ ఛాంపియన్ షిప్స్ మరియు అంతర్జాతీయ FIG కార్యక్రమాల్లో వివిధ పతకాలను గెలిచింది.

జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిల్లో విజయవంతంగా పోటీపడటానికి భారతదేశపు అథ్లెట్లకు వీలు కల్పించే లక్ష్యంతో ప్రత్యేకమైన శిక్షణ, శిక్షణా మౌళికసదుపాయాలు మరియు అథ్లెట్ మద్దతు ద్వారా అత్యధిక సామర్థ్యం గల జిమ్నాస్టిల అభివృద్ధికి మద్దతు చేస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -