Wednesday, September 16, 2026
E-PAPER
Homeజాతీయం​చారిత్రాత్మక విజయం సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ

​చారిత్రాత్మక విజయం సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ

- Advertisement -

“నోఖా నగర పాలికలోనూ, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వార్డుల్లోనూ సీపీఐ(ఎం) సాధించిన చారిత్రాత్మక విజయానికి పార్టీ కార్యకర్తలకు, రాజస్తాన్ ప్రజలకు అభినం దనలు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ ల మతతత్వ విషాన్ని ఎదిరించి, ప్రజా సమస్యలపై పోరాడే ప్రతిచోటా ఎర్రజెండా రెపరెపలాడుతుంది”

​పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అభినందనలు: కేరళం మాజీ సీఎం పినరయి విజయన్
“నోఖా మున్సిపాల్టీలో మొత్తం 45 స్థానాలకు గాను 29 స్థానాలను గెలుచుకుని మున్సిపాలిటీపై పట్టు సాధించడం అనేది రాజస్తాన్‌‌లో సీపీఐ(ఎం)కు ఒక కీలక ముందడుగు. ఇది మా కార్యకర్తల అవిశ్రాంత కృషికి, నోఖా ప్రజలు వారిపై ఉంచిన నమ్మ కానికి ప్రతిఫలం. ఈ విజయాన్ని సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు” అని పేర్కొన్నారు.

​ఇది స్థానిక విజయం మాత్రమే కాదు : సీపీఐ(ఎం) రాజస్తాన్‌ రాష్ట్ర కార్యదర్శి కిషన్ పారిఖ్
బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకత, ప్రజా, ఆర్థిక సమస్యలపై సీపీఐ(ఎం) నిరంతరం సాగించిన పోరాటమే ఈ విజయానికి కారణం. ప్రజలు సీపీఐ(ఎం)ని ఒక బలమైన ప్రత్యామ్నాయంగా భావించి మాకు ఓటు వేశారు. పార్టీకి ఉన్న ఆదరణ కేవలం స్థానిక సమస్యలకే పరిమితం కాలేదు. ఆర్థిక సమస్యల కోసం, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడగల పార్టీ ఏదైనా ఉందంటే, అది సీపీఐ(ఎం) మాత్రమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -