Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కస్తూర్బాలో అడ్మిషన్ల కోసం ఆహ్వానం 

కస్తూర్బాలో అడ్మిషన్ల కోసం ఆహ్వానం 

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి  : మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరవ తరగతి ఇంగ్లీష్ మీడియం లో అడ్మిషన్లు కోరే విద్యార్థుల కోసం ఆహ్వానం పలుకుతున్నట్లు ప్రత్యేక అధికారిని గంగామణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరవ తరగతిలో 30 ఖాళీలు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఉచిత విద్య, భోజన వసతి, యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అందిస్తామని తెలిపారు. విద్యార్థినికి నెలకు రూ.275 చొప్పున 11 నెలలకు గాను రూ.3025 కాస్మోటిక్ చార్జీలు  అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. కస్తూర్బా గాంధీ విద్యాలయంలో అడ్మిషన్లు కోరే విద్యార్థినిలు ఆధార్ కార్డు, బోనఫైడ్, కుల ధ్రువీకరణ పత్రము, బ్యాంకు అకౌంట్ జిరాక్స్ ప్రతులతో అడ్మిషన్ల కోసం  సంప్రదించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఫోన్ నెంబర్ 7675964429 కు సంప్రదించాలని ప్రత్యేక అధికారిని గంగమణి ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad