ఎండీఆర్ నిర్ణయంపై వ్యాపారులు, పెట్రోల్ బంక్ నిర్వాహకుల ఆందోళన
పెట్రోల్ బంక్‌లకు రూ.2 వేలకుపైగా యూపీఐ చెల్లింపులపై రూ.5 ఫ్లాట్ చార్జీ
చార్జీలను ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా నిరసనలకు దిగుతాం : వ్యాపారుల హెచ్చరిక
న్యూఢిల్లీ : యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్ ) విధించే నిర్ణయంపై వ్యాపారులు, పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రూ.2 వేలకుపైగా విలు వైన లావా దేవీలపై చార్జీలు విధిం చడాన్ని వ్యా పార సంఘాలు వ్యతిరేకి స్తున్నా యి. ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపార సంఘం ‘ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ’ ( సీటీఐ) ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. చార్జీలను ఉపసం హరిం చుకోకపోతే దేశవ్యాప్తంగా వ్యాపారులు నిరసనలకు దిగుతారని హెచ్చరించింది.
పెట్రోల్ బంక్‌లపై అదనపు భారం
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ భారం పడితే తమ లాభాలపై ప్రభావం చూపుతుందని పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా పలువురు పెట్రోల్ బంక్ నిర్వాహకులు తమను సంప్రదించినట్టు సీటీఐ చైర్మెన్ బ్రిజేశ్ గోయల్ తెలిపారు. రూ.2 వేలకుపైగా యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ విధిస్తే, ఆన్‌లైన్ చెల్లింపులను స్వీకరించడం నిలిపివేయాల్సి రావచ్చని వారు చెబుతున్నారని పేర్కొన్నారు. సాధారణంగానే కారులో పెట్రోల్ లేదా డీజిల్ నింపినప్పుడు బిల్లు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఉంటుందని గోయల్ వివరించారు. ట్రక్కులకు ఇంధనం నింపితే బిల్లు రూ.10 వేలు దాటుతుందని చెప్పారు. మరోవైపు పెట్రోల్ బంక్ నిర్వాహకులకు లీటరుకు లభించే కమిషన్ రూ.3 నుంచి రూ.4 వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు.
ఇప్పటికే క్రెడిట్ కార్డులపై చార్జీలు
క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఇప్పటికే 0.8 శాతం నుంచి 1 శాతం వరకు ఎండీఆర్ విధిస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు యూపీఐ చెల్లింపులపైనా చార్జీలు విధిస్తే తమపై అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కొన్ని పెట్రోల్ బంక్‌ల వద్ద ‘‘రూ.2 వేల కంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులు స్వీకరించరు’’ అని బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి కూడా రావచ్చని వ్యాపార సంఘాలు చెబుతున్నాయి. అయితే తాజా యూపీఐ విధానంలో ఇంధనం వంటి కొన్ని రంగాల్లో రూ.2 వేలకుపైగా లావాదేవీలకు శాతం ఆధారిత ఎండీఆర్ కు బదులుగా ప్రతి లావాదేవీకి రూ.5 ఫ్లాట్ ఎండీఆర్ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ చార్జీ వినియోగదారుల నుంచి నేరుగా వసూలు చేయరాదని కూడా స్పష్టం చేసింది.
ఎండీఆర్‌తో డిజిటల్ చెల్లింపులపై ప్రభావం
ఎండీఆర్ ను వినియోగదారులపై కాకుండా వ్యాపారులపై విధిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, చివరకు దాని ప్రభావం వినియోగదారులపైనా పడే అవకాశం ఉందని సీటీఐ ప్రధాన కార్యదర్శి గుర్మీత్ అరోరా, రమేశ్ అహుజా పేర్కొన్నారు. ఢిల్లీలోని చాందినీ చౌక్, సదర్ బజార్, కరోల్ బాగ్, కన్నాట్ ప్లేస్, లజ్‌పత్ నగర్, సరోజినీ నగర్ వంటి ప్రధాన మార్కెట్లలో 70 శాతానికిపైగా వ్యాపారులు యూపీఐ చెల్లింపులు స్వీకరిస్తున్నారని తెలిపింది. వ్యాపారులపై ఎండీఆర్ భారం పెరిగితే కొందరు నగదు చెల్లింపులను ప్రోత్సహించే అవకాశం ఉందని ఆ సంస్థ పేర్కొంది. దీనివల్ల ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలో ఉన్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
సీటీఐ కీలక డిమాండ్లు
రూ. 2,000 దాటిన యూపీఐ చెల్లింపులకు ఎండీఆర్ చార్జీల నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలి. రూపే కార్డులు, యూపీఐ సేవల కోసం వ్యాపారులపై లేదా వినియోగదారులపై ఎలాంటి రుసుము విధించొద్దు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా వ్యాపారుల నిరసన చేపడతాం



