క్రీడల్లో ఓడిన  కృంగి పోవద్దు..

– విన్నర్ గా న్యూ స్టార్..
– రన్నర్ గా రెడ్డి యూత్..
నవతెలంగాణ-డిచ్ పల్లి : క్రీడల్లో గెలుపోటములు సహజమని ఓడిన వారు కృంగి పోకుండా దైర్యంగా  ముందుకు పోతే వచ్చే క్రీడల్లో కచ్చితంగా గెలుస్తారని ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్  ఛైర్మెన్ సాంబారు మోహన్, సర్పంచ్ నోముల విజయ లక్ష్మారెడ్డి, వైస్ ఎంపీపీ భూసని అంజయ్య అన్నారు. బుదవారం ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి  గ్రామం లో సాకలి సాయిలు స్మారకార్థం నిర్వహించిన క్రికెట్  టోర్నమెంట్ ను   ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి మనిషికి జీవితం లో  మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడలు ఎంతో ఉపయోగ పడతాయనీ అన్నారు. ఆరోగ్యం తో పాటు క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. సాకలి సాయిలు  మంచి క్రికెట్ క్రీడాకారుడు అని   ఆయన అకాల మరణం చెందడం తో ఆయన కుటుంబ సభ్యులు సాకలి  సాయిలు   స్మారకార్ధం  నల్లవెల్లి  గ్రామం లో  క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించడం అనందంగా ఉందన్నారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం పది టీమ్ లు పాల్గొనగా  విన్నర్ జట్టుగా న్యూ స్టార్ యూత్ , రన్నర్  జట్టుగా  రెడ్డి యూత్  జట్లు   గెలుపొందాయి.  గెలిచిన క్రీడాకారులకు  కప్  లను అందజేశారు.ప్రతి క్రీడాకారుడు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనాలని అన్నారు.  ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ బాబు శరత్, మాజీ సొసైటీ ఛైర్మెన్ కుంట గంగారెడ్డి , పిల్లకాయ గంగారెడ్డి, మనోహర్ గౌడ్,  ఎడ్ల మోహన్, వీడీసీ అద్యక్షులు మిద్దె నర్సయ్య, నీరడి మనోహర్, మహేష్ ,ఇనేష్, సుమన్  కుటుంబ సభ్యులు ,గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love