నవతెలంగాణ-భిక్కనూర్ : మండలంలోని బస్వాపూర్ గ్రామంలో హరిజనవాడ కాలనీలోని ప్రాథమిక పాఠశాలకు గ్రామానికి చెందిన లంబాడి స్వామి కార్పెట్ ను వితరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం నాడు విద్యార్థులు క్రింద కూర్చోవడానికి గమనించి కార్పెట్ ను వితరణ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడుం ప్రదీప్, బాబు, కిరణ్, ప్రేమ్ కుమార్, స్వామి, వినయ్, తదితరులు పాల్గొన్నారు.