
– పనిచేసే చేతు విరగడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిన వైనం
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని హెచ్ కేలూర్ గ్రామపంచాయతీ పరిధిలోగల పత్తి మిల్లులో ప్రమాదం జరిగి ఒక కూలీ కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. కుడిచేతి మట్ట పూర్తిగా దెబ్బతిన్నట్లు, చేతి వేళ్ళు తెగిపోయినట్లు ఎక్స్రేలో స్పష్టంగా కనిపిస్తుంది. గాయపడ్డ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి మిల్లులో లేబర్ గా పనిచేసిన వ్యక్తి పేరు మారుతి తండ్రి హనుమంత్ ఇంటి పరు వాగ్మారే ఇతను మహారాష్ట్రలోని గ్రామం కవల్గావ్ తాలూకా దెగ్లూర్ జిల్లా నాందేడ్. ఈ వ్యక్తి గత రెండు మూడు నెలలుగా పత్తి మిల్లులో పత్తి బేళ్లు మిషన్ల వద్ద కూలిగా పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు పత్తి బేళ్ల తయారీ మిషన్ లో కుడిచేతు ప్రమాదానికి గురైంది. ఆ చేతు మట్టతోపాటు రెండు వేలు పూర్తిగా విరిగినట్లు, చేతి గాయానికి రాడ్లు వేసినట్టు, గాయపడ్డ కూలి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన ఆ కూలికి ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి,భార్య. మొత్తం కుటుంబంలో ఐదుగురు కుటుంబం. యజమాని ప్రమాదానికి గురై పనిచేసే కుడిచేతూ విరిగిపోవడం కుటుంబ పోషణకు ఇబ్బందిగా మారింది. లేబర్ చట్టాలు అమలయ్యేనా అంటూ మహారాష్ట్ర నుండి ఇక్కడికి కూలి కోసం వచ్చిన యజమాని కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెxలంగాణలో పరిశ్రమల శాఖ, లేబర్ శాఖ చట్టాలు పకడ్బందీగా అమలవుతాయని ఆశ ఆ కుటుంబం ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గురై కుడి చేతు పనికి రాకుండా తీవ్ర గాయాన్ని రాడ్లు వేసి చికిత్స చేసినప్పటికీ, ఆ చేతు బరువు ఎత్తే స్తోమత కోల్పోతుందని, కుటుంబ పోషణ జరిగేది ఎలా అంటూ కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదానికి గురైన వ్యక్తికి పత్తి మిల్లు యజమాని దేగ్లూర్ పట్టణ కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సలు జరిపించారు. గాయం తగ్గడానికి విరిగిన చేతుకు రాడ్లు వేసి చికిత్స చేశారు. ప్రమాదానికి గురైన వ్యక్తి కొన్ని నెలల పాటు షిక్కయ్యారు. బతుకుదెరువు కోసం మహారాష్ట్ర నుండి తెలంగాణ ప్రాంతంలోని పత్తి మిల్లులో కూలి పని కోసం వస్తే ప్రమాదవశాత్తు పత్తి బేళ్ళ మిషన్లో చేతు ఇరుకపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రమాదంతో పనిచేయరాకుండా విరిగిన చేతి పట్ల లేబర్ చట్టాలు అమలుపరిచి న్యాయం చేకూరుస్తే నిరుపేద కుటుంబానికి కుటుంబ పోషణ కోసం ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం, అలాగే పత్తి మిల్లు యజమాని నుండి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందించి, ఆదుకోవలసిన లేబర్ యూనియన్ నాయకులు గాని, సంబంధిత శాఖల అధికారులు గానీ, స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆ కుటుంబం వేడుకుంటోంది.