- Advertisement -
తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డికి వినతి పత్రం అందజేత
నవతెలంగాణ –  కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులతో న్యాయవాదుల సమస్యలపై సమావేశాన్ని  గురువారం హైదరాబాద్ లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి కి  కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు నంద రమేష్ వినతి పత్రం అందజేశారు. బార్ కౌన్సిల్ తరపున న్యాయవాదు లకు డెత్ బెనిఫిట్స్ రూ.6 లక్షలు నుంచి 20 లక్షలకు పెంచాలని, హెల్త్ కార్డుల పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని అన్నారు. అదేవిదంగా నోటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని తదితర సమస్యలు పై వినతి పత్రన్ని అందజేశారు.
- Advertisement -

 
                                    