
– మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి
నవతెలంగాణ – తొగుట
అనితర సాధ్యమైన తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల కల సహకారం చేసిన కారణ జన్ముడు మాజీ సీఎం కేసీఆర్ అని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. శనివా రం కేసీఆర్ 70వ జన్మదినోత్సవం సందర్భంగా రాంపూర్ మదనానంద శారదా క్షేత్రంలో స్పటిక లింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల కల సాకారం చేయడంతో పాటు, 9 ఏళ్లలో దేశంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను ముందు వరుసలో నిలిపిన ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందనిన్నారు. 60 ఏళ్ల తెలంగా ణ పోరాటంలో ఎవరికీ సాధ్యం కాని తెలంగాణ సాధన కేసీఆర్ అలుపెరుగని పోరాటంతో సాధ్య మైందన్నారు. తెలంగాణ సాధించడంతో పాటు నీళ్లు, నిధులు, నియామకాలు అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. అధికారం శాశ్వతం కాదని, చేసిన పనులు జీవితాంతం తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ పై దుష్పచారం చేస్తుందని, నేడు తాగునీళ్లు, సాగు నీళ్లు, నాణ్యమైన కరెంటు, సంక్షేమ పథకాలు కేసీఆర్ చొరవతోనే సాధ్యమయ్యాయన్నారు. మండల ప్రజల పక్షాన కేసీఆర్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాధిం చిన కేసీఆర్ తెలంగాణ జాతిపితగా చరిత్రలో నిలిచిపోయాడని వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డిలు పేర్కొన్నారు. భవిష్యత్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని వారు కోరుకున్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు సుతారి లలిత రమేష్, కొమ్ము శరత్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరి మల్లా రెడ్డి, కుంభాల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య, మండల యూత్, బీఆర్ఎస్వీ అధ్యక్షులు మాదాసు అరుణ్ కుమార్, నంట పరమేశ్వర్ రెడ్డి, నాయకులు పబ్బతి శ్రీని వాస్ రెడ్డి, మంగ నర్సింహులు, ఎం చంద్రారెడ్డి, లక్మారెడ్డి, జంగిడి బిక్షపతి, బోయిని శ్రీనివాస్, వెంకట్ గౌడ్, నరేందర్ గౌడ్, కొమ్ము రాజశేఖర్, డా|| శ్రీనివాస్, లక్ష్మణ్, జనార్ధన్ రెడ్డి, మధుసుధన్ రెడ్డి,, భాస్కర్, నాగరాజు, సంతోష్ రెడ్డి, పరమేశ్వర్, బాలేష్, డీలర్ మల్లేశం, స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.