– మార్చి 1వ తేదీన స్వామివారి కల్యాణం….
నవతెలంగాణ-భువనగిరి రూరల్ : భువనగిరి మండలం లోని నమాత్ పల్లి గ్రామంలో గల స్వయంభు శ్రీ పూర్ణగిరి సుదర్శన లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన పోస్టర్ ను పూర్ణగిరి ఆలయంలో ఆలయ చైర్మన్ అతికం లక్ష్మీనారాయణ గౌడ్ , నరసింహ ఉపాసనకులు బత్తిని రాములతో కలిసి ఆవిష్కరించారు. మొదటి కళ్యాణ ఆహ్వాన పత్రికను స్వామి వారి ప్రథమ భక్తుడు బత్తిని రాములు కు అందజేశారు. స్వామివారి కల్యాణం మార్చి 1వ తేదీన ఉదయం 6 గంటలకు సుదర్శన నరసింహస్వామి వారి మూలవిరాట్ కు అభిషేకం, ఉదయం 8 గంటలకు సుదర్శన నరసింహ స్వామి వారి హోమం,
11:30 నిమిషాలకు సుదర్శన లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు తీర్థప్రసాదాలు, ఒంటిగంటకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవం వేద బ్రాహ్మణులచే అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం లో పాల్గొని, తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి పవన్ కుమార్ శర్మ, సిబ్బంది వెంకటేష్, భక్తులు పాల్గొన్నారు.