ప్రజా సమస్యలకై క్యాంపు కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే

– వారానికి రెండు రోజులు అందుబాటులో ఉంటా
– తాగునీటి సమస్యను పరిష్కరిస్తా
–  నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా
– విలేకరుల సమావేశంలో కుంభం వెల్లడి
నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
యాదాద్రి భువనగిరి జిల్ల భువనగిరి నియోజకవర్గ క్యాంపు కార్యాలయంను సోమవారం రోజున భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. భువనగిరి నియోజకవర్గ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళల అందుబాటులో ఉంటానని , ప్రజా సమస్యలపై ఆర్జీలను క్యాంపు కార్యాలయంలో అందజేయవచ్చునని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.వారానికి రెండు రోజులు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తా అన్నారు. మిషన్ భగీరథ వాటర్ కు సంబంధించి సమస్యలు ఉన్నట్లు వాటిని పరిష్కరిస్తామని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని, అభివృద్ధి కోసం అందరి మంత్రులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. మూసి ప్రక్షాళన కోసం వెయ్యి కోట్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, భువనగిరి జిల్లా అభివృద్ధి కోసం కృషి, తిమ్మాపురం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భువనగిరి నియోజకవర్గం నుండి కుంభం అనిల్ కుమార్ రెడ్డి  గెలుపొందిన విషయం తెలిసిందే , నాటి నుండి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు  కార్యాలయంలో వాస్తు దోషాల కారణంగా గత రెండు నెలలుగా  రాలేక పోయానని , క్యాంపు కార్యాలయాన్ని పూర్తిగా వాస్తు దోషాలను తొలగించిన పిదప సోమవారం మంచి రోజు కావడంతో కుంభం అనిల్ కుమార్ రెడ్డి పట్టణంలోని రహదారి బంగ్లాలో క్యాంపు కార్యాలయాన్ని వేద బ్రాహ్మణుల మంత్రోక్షణలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే ఛాంబర్ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి, ప్రారంభించారు.  నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేటి నుండి ప్రజాదరఖాస్తులు చేసుకోవచ్చునని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కారం కోసం తమ దృష్టికి తీసుకురావాలని పైరవీకారులను ఆశ్రయించవద్దని నేరుగా తనతో కలిసి మాట్లాడవచ్చునని తెలిపారు. మొదటి రోజు ప్రజల నుండి సమస్యల పత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్,  పిసిసి కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ , మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ , నాయకులు రవికుమార్ , కుక్కదువ్వు సోమయ్య , పట్టణ అధ్యక్షుడు కూర వెంకటేష్ , బిసుకుంట్ల సత్యనారాయణ,మాజీ ఎంపీపీ తోటకూర వెంకటేష్ యాదవ్, రసాల దత్తు యాదవ్ , మాజీ  చైర్మన్ దొనకొండ వనిత,  నూతి రమేష్ , ఎంపీటీసీలు , సర్పంచులు , కౌన్సిలర్లు , నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love