నాల్గవ రోజు బ్రహ్మోత్సవాలు 

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మామిడిపల్లి గ్రామ శివారులో గల అపురూప వెంకటేశ్వర ఆలయంలో సప్తాహ్నిక పుష్కర బ్రహ్మోత్సవాలు భాగంగా నాల్గవ రోజు బ్రహ్మోత్సవాలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఉదయం శాంతిపాఠము, వేదాది విన్నపములు, ద్వారతోరణ ధ్వజకుంభ ఆరాధన, మూర్తికుంభ ఆరాధన, (సర్వరోగ నివారణకు, ఆరోగ్య అభివృద్ధికై) అరుణహోమం, పంచసూక్త హోమం, పూర్ణాహుతి, నివేదన, బలిహరణ, మంగళాశాసనం. సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, యాగశాలార్చనలు, పూర్ణా హుతి, శేషవాహనము, నివేదన, బలిహరణ, నీరాజనం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్పర్సన్ అమృత లత, కమిటీ సభ్యులు, రమాదేవి,  అర్చకులు, ప్రజలు పాల్గొన్నారు.
Spread the love