నవతెలంగాణ-కారేపల్లి
మండలంలో మాధారంలో అమరురాలు తుమ్మలపల్లి శాంతమ్మ జ్ఞాపకార్ధం, చేతన పౌండేషన్ ఆధ్వర్యంలో పేదమహిళలకు కుట్టుమిషన్లను పంపిణి చేశారు. సోమవారం మాధారంలో జరిగిన తుమ్మలపల్లి శాంతమ్మ సంస్మరణ సభలో ఇల్లందు మున్సిపాల్ చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు(డీవీ), ప్రముఖ కవి జయరాజ్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, మాస్‌లైన్ రాష్ట్రనాయకులు రాయల చంద్రశేఖర్ చేతుల మీదిగా మహిళలకు అందజేశారు. ఈ సందర్బంగా చేతన పౌండేషన్ సేవలను వారు కొనియాడారు. పేదలు ఆర్ధికంగా నిలదొక్కుకోవటానికి స్వచ్ఛంద సంస్ధలు, దాతలు సాయం చేయటం అభినందనీయమన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా బాధితులు, పేదలను అక్కున చేర్చుకోవాలని ఆకాంక్షించారు.