మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటమే సుందరయ్యకు ఘన నివాళి!

వర్ధంతి సభలో పోతినేని, నున్నా
నవతెలంగాణ-ఖమ్మం
స్థానిక సుందరయ్య భవనంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు అధ్యక్షతన దక్షిణ భారత కమ్యునిస్ట్‌ ఉద్యమ నిర్మాత, పేదల పెన్నిధి కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి జరిగింది. మొదట సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా విప్లవజోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.సుదర్శన్‌రావు మాట్లాడుతూ వర్గరహిత సమాజం సాధించటం అంత సులభమైన పని కాదని, అనేక ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. పార్టీ విధానం పట్ల వినయ విధేయతలు, నిరాడంబర జీవితం, ఎల్లప్పుడూ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండటం వలన సుందరయ్య అత్యుత్తమ కమ్యూనిస్టు నాయకుడయ్యాడని అన్నారు. ప్రజల మనిషిగా, ప్రజల కోసం చివరి వరకూ జీవించి ప్రజా పోరాటాలకు ప్రాధాన్యతనివ్వడంతోపాటు, సామాజిక పోరాటాలకు, సేవా కార్యక్రమాలకు కూడ అంతే ప్రాధాన్యతను సుందరయ్య ఇచ్చాడని అన్నారు. శ్రమను గౌరవించే సమాజం ఏర్పాటుకు అవిరళ కృషి చేశారని, స్త్రీలను కించపర్చడం, కులాధిక్యత భావాలను ఉపయోగించుకొని దళితులను, బలహీనవర్గాలను పీడిరచే చర్యలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారన్నారు. ఎమర్జెన్సీ సమయంలో పార్టీని, కార్యకర్తలను కాపాడుకోవటంలో వివిధ ఎన్నికల సందర్భంగా వచ్చిన ప్రతికూల ఫలితాలలో సైతం కార్యకర్తలను నిలబెట్టడంలో సుందరయ్య కీలకపాత్ర పోషించారన్నారు. మార్క్సిజం పట్ల ఎంచుకున్న లక్ష్యం పట్ల సుందరయ్య స్పష్టతతో వుండి ఉద్యమాన్ని నిర్మాణం చేశారన్నారు. పార్టీని, ప్రజా సంస్థలను, సంఘాలను పోరాట కార్యక్రమాలతో పాటు, ప్రజా సంక్షేమం, సేవా కార్యక్రమాలు చేయాలని, సుందరయ్య చూపిన బాటలో పయనం చేయాలని కోరారు. ప్రస్తుతం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్మగమని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని అట్టి విధానాలపై పోరాటమే అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్యకు మనం ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, అదే పద్ధతిలో ప్రజల జీవన ఆర్థిక ప్రమాణాలు పెరగడం లేదని, పరువు ఆత్మ హత్యలు ఇటీవల పెరిగాయని, దేశంలో నేరాలు, ఘోరాలు పెరిగాయని మోడీ ప్రభుత్వం వీటిపై దృష్టి సారించకుండా, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీల సంక్షేమానికి ఏర్పాటు చేసుకున్న ఉద్యోగాల రిజర్వేషన్‌ ఎత్తి వేసే దానికి కుట్ర చేస్తుందని ప్రైవేటీకరణ జరిగితే రిజర్వేషన్‌ లు పోయే ప్రమాదం వుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల మహిళలకు సమాజ అవగాహన కల్పిస్తూ డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు కృషి చేసిన క్షేత్రస్థాయి ఉద్యోగులైన విఓఏలు గత నెల రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదని అన్నారు. కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తూ దళితులపైన, మైనార్టీలపైన దాడులు చేస్తున్నదని అన్నారు. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో ప్రజలంతా పాల్గొని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని కోరారు. రాబోయే కాలంలో ప్రజా సమస్యలపై ఉద్యమాలను నిర్మించటమే మనం సుందరయ్యకిచ్చే ఘన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర నాయకులు యం.సుబ్బారావు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.విక్రం, జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్‌, మెరుగు సత్యనారాయణ, బండి పద్మ, పి.ఝాన్సీ, బండారు రమేష్‌, విష్ణు, నందిపాటి మనోహర్‌, ఆర్‌.ప్రకాష్‌, పిన్నింటి రమ్య, జిల్లా నాయకులు యస్‌.కె. మీరా, కె.దేవేంద్ర, వెంకటాద్రి, నాగేశ్వరరావు, భాగం అజిత, విప్లవ కుమార్‌, మాచర్ల గోపాల్‌, బివికె మేనేజ్‌ మెంట్‌ వై.శ్రీనివాసరావు, అఫ్జల్‌, శివనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మధిర : స్థానిక బోడెపూడి భవనం నందు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని, మరియు కామ్రేడ్‌ ఉమామహేశ్వరావు స్తూపం వద్ద సీపీఐ(ఎం) టౌన్‌ కార్యదర్శి మండవ ఫణీంద్ర కుమారి జెండా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు శీలం నరసింహారావు, టౌన్‌ కమిటీ సభ్యులు పడకంటి మురళి, తేలప్రోలు, రాధాకృష్ణ, పెంటి వెంకటరావు, విల్సన్‌ వడ్రాణపు మధు, సారథి, తదితరులు పాల్గొన్నారు.
కారేపల్లి : పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఉపాధి కూలీలు శుక్రవారం కారేపల్లి మండలం ఉసిరికాయల పల్లిలో పని ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. ఉపాధీ పని ప్రదేశంలో వ్యవసాయ కార్మిక సంఘం పతాకాన్ని ముఠామేస్త్రీ లాకావత్‌ కమల అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు కొండెబోయిన నాగేశ్వరరావు, ఉసిరికాయలపల్లి సర్పంచ్‌ బానోత్‌ బన్సీలాల్‌, వ్యకాస నాయకులు పాల్గొన్నారు.
కారేపల్లి సీపీఎం కార్యాలయంలో సుందరయ్య వర్ధంతిని జరిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు కే.నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే.నరేంద్ర, వజ్జా రామారావు, మండలకమిటీ సభ్యులు రేగళ్ల మంగయ్య, తలారి దేవప్రకాశ్‌, కే.ఉమావతి, పట్టణ కార్యదర్శి అన్నారపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వైరా : విప్పలమడక సీపీఎం కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమంలో తొలుత సీపీఎం సీనియర్‌ నాయకులు గ్రామ సర్పంచ్‌ తుమ్మల జాన్‌ పాపయ్య సుందరయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ సభ్యులు గరిడేపల్లి సుబ్బారావు, చావా వెంకటేశ్వరరావు, అభిమానులు గోసు కృష్ణయ్య, పాల్గొన్నారు.
నేలకొండపల్లి : మండలంలోని కోరట్లగూడెం, ఆరెగూడెం, అమ్మగూడెం, భైరవునిపల్లి, నేలకొండపల్లి, రాయగూడెం, బోదులబండ, ముఠాపురం తదితర గ్రామాలలో సుందరయ్య 38వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) మండల కార్యదర్శి కె.వి.రామిరెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు పగిడికత్తుల నాగేశ్వరరావు, పార్టీ జిల్లా నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, ఏటుకూరి రామారావు, పగిడికత్తుల నాగేశ్వరరావు, దుగ్గి వెంకటేశ్వర్లు, డేగల వెంకటేశ్వరరావు, బండి రామమూర్తి, కట్టెకోల వెంకన్న, బెల్లం లక్ష్మి ఇంటూరి అశోక్‌ కొత్తూరు వెంకటాచారి, ఎస్కే లాల్‌ పాషా, గాదే వెంకటేశ్వర్లు, గురజాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కొణిజర్ల : మండల కేంద్రంలోని సీపీఎం కార్యలయంలో అదేవిధంగా చిన్నగోపతి, తనికెళ్ళ, కొండవనమాల, కొత్త కాచారం, సీంగరాయపాలెం, లక్ష్మీపురం, తీగలబంజర, చిన్నమునగాల తదితర సుందరయ్య వర్థంతిని నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, సీపీఎం సీనియర్‌ నాయకుడు కొప్పుల క్రిష్ణయ్య, జిల్లా కమిటీ సభ్యులు మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు, తాళ్లపల్లి క్రిష్ణ, వెంకయ్య, మోత్కూరి వెంకయ్య, యూటిఫ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ రంజాన్‌, డాక్టర్‌ బోయినపల్లి శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
సత్తుపల్లి : స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో పుచ్చలపల్లి 38వ వర్థంతి సభ ఆ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పుచ్చలపల్లి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండు రంగారావు, పట్టణ కార్యదర్శి రావుల రాజబాబు, నాయకులు కొలికపోగు సర్వేశ్వరరావు, వెంకట్రావు, వెంకటేశ్వరరావు, రామకృష్ణ, బాషా, ప్రసాద్‌ పాల్గొన్నారు.
బోనకల్‌ : మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయం వద్ద అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్‌ బోయినపల్లి వీరబాబు, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, నాయకులు బిల్లా విశ్వనాథం, దారగాని ఏడుకొండలు, బుక్య జాలు, బొబ్బిళ్ళపాటి రాజు, రామన నరసింహారావు, అవునూరి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ : సీపీఐ(ఎం) కార్యాలయంలో జరిగిన పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిలో పార్టీ మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వర, మాజీ మండల కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి, గుంటుపల్లి వెంకటయ్య, తమ్మిశెట్టి శ్రీను, సత్తెనపల్లి నరేష్‌, షేక్‌ మస్తాన్‌, చల్లా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం: మండలంలోని వెదుళ్ళ చెరువు, పాపాయి గూడెం, పిండిప్రోలు, దమ్మాయిగూడెం, గోల్‌ తండా, బీరోలు, తాళ్లచెరువు, జుపెడ, కాకరవాయి, బచ్చోడు తదితర గ్రామాలలో సుందరయ్య వర్ధంతి సభలు నిర్వహిం చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, పార్టీ సీనియర్‌ నాయకులు దొండేటి ఆనందరావు, అంగిరేకుల నరసయ్య, తుళ్లూరి నాగేశ్వరరావు, బింగి రమేష్‌, కొత్తపల్లి వెంకన్న, పప్పుల ప్రసాద్‌ పాల్గొన్నారు
సత్తుపల్లిరూరల్‌ : ప్రకాశ్‌నగర్‌, రామగోవిందాపురం గ్రామాలలో ఉపాధి కూలీల పని ప్రదేశాలకు వెళ్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా వ్యకాస ఆధ్వర్యంలో సుమారు 150 మంది ఉపాధి కూలీలకు అరటి పండ్లు, మజ్జిగ ప్యాకట్లు పంచారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
గంగారంలోని వాసు గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్లో ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కువ్వారపు లక్ష్మణ రావు అధ్యక్షతన సుందరయ్య వర్థంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు వేపుల పాటి కుమారస్వామి, బాయమ్మ, ఎం.శ్రీను, విష్ణు వాసు, కుమారి పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్‌ : పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం పాలేరు నియోజకవర్గం ఇంచార్జ్‌ బండి రమేష్‌ అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్‌ మండలం జలగం నగర్‌ లో పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు నందిగామ కృష్ణ అధ్యక్షతన పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభ జరిగింది. తొలుత చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. ఈ సభలో పార్టీ మండల కార్యదర్శి ఎన్‌. ప్రసాద్‌, కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు పొన్నెకంటి సంగయ్య, వై ప్రసాదరావు, మారబోయిన పుల్లయ్య, ఏ శ్రీను, రఘు, అంజయ్య, కౌసల్య, అచ్చమ్మ, బద్ది ,హనుమంతరావు, గోవిందరావు, బాలరాజు, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, ముత్తయ్య, అనంతనేని వీరయ్య, చెరుకూరి మురళి, వెంకట నరసయ్య, శేషగిరి ,రామస్వామి ,చిరంజీవి , వడ్లమూడి నాగేశ్వరరావు, మద్ది వెంకటరెడ్డి, పొన్నం వెంకటరమణ, కారుమంచి గురవయ్య, పి.మోహన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంకార్పొరేషన్‌: ఆదర్శ వంతమైన జీవితం గడిపిన సుందరయ్య నేటి తరానికి నిరంతర స్ఫూర్తి ప్రదాత అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్‌ పేర్కొన్నారు. స్థానిక సిపిఎం త్రీ టౌన్‌ కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్థంతి సందర్భంగా కార్యదర్శి భూక్యా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యాలయంపై పార్టీ జెండాను యర్రా శ్రీకాంత్‌ ఎగురవేశారు.అనంతరం పార్టీ కార్యాలయం నుండి గాంధీ చౌక్‌ సెంటర్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, జిల్లా నాయకులు తుశాకుల లింగయ్య, సీనియర్‌ నాయకులు బండారు యాకయ్య, షేక్‌ సైదులు, కార్పొరేటర్‌ ఎల్లంపల్లి వెంకటరావు, కార్యదర్శివర్గ సభ్యులు బండారు వీరబాబు, పత్తిపాక నాగ సులోచన, శీలం వీరబాబు, షేక్‌ ఇమామ్‌ మండల నాయకులు రంగు హనుమంత చారి, నాయిని నరసింహారావు, గబ్బెటి పుల్లయ్య, చీకటి మల్ల శ్రీను, షేక్‌ ఖాసిం, నాయకులు జీవి చౌదరి, జి.పున్నయ్య, భూక్య సుభద్ర, హెచ్‌.పేరయ్య, మీనాల మల్లికార్జున్‌ పాల్గొన్నారు.
ఖమ్మం : నగరంలో జిల్లా ఆటో వర్కర్స్‌ యూనియన్‌ ( సిఐటియు ) ట్రాన్స్పోర్ట్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ వై. విక్రమ్‌ అధ్యక్షతన పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా కొత్త బస్టాండ్‌ వద్ద జెండాను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు విష్ణు, ఆటో యూనియన్‌ జిల్లా కార్యదర్శి జిల్లా ఉపేందర్‌, జిల్లా నాయకులు బోడపట్ల సుదర్శన్‌, జే వెంకన్న బాబు, డివైఎఫ్‌ఐ నాయకులు ఉపేందర్‌, రాజేష్‌, ట్రాక్టర్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి. డి రాందాస్‌, ఆటో యూనియన్‌ జిల్లా నాయకులు కాసిం, నరసయ్య, శ్రీను, నాగేశ్వరావు ,హుస్సేన్‌ బిక్షం డ్రైవర్లు పాల్గొన్నారు.
ముదిగొండ: .పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ముదిగొండ, కట్టకూరు, పెద్దమండవ, అమ్మపేట గ్రామాలలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, వైస్‌ఎంపీపీ మంకెన దామోదర్‌, సిపిఐ(ఎం) నాయకులు వేల్పుల భద్రయ్య, మందరపు వెంకన్న, పద్మ, ఊటుకూరి గోపయ్య, బెజవాడ వెంకటేశ్వరరావు, రాయల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పెనుబల్లి : పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి పెనుబల్లిలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు చలమాల విట్టల్‌రావు, మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు, మామిళ్ళ వెంకటేశ్వరరావు, కండే సత్యం, మిట్టపల్లి నాగమణి, కొప్పుల వెంకటేశ్వరరావు, నల్లమల ప్రతాప్‌ పాల్గొన్నారు.
కల్లూరు : కల్లూరు నూతన బస్టాండ్‌ లో వ్యవసాయ కార్యదర్శి సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు తన్నీరు కృష్ణార్జునరావు, కల్లూరు ప్రముఖులు కట్టా గోపాలరావు, గొర్రెల మేకల సంఘం మండల కార్యదర్శి బట్టు నరసింహారావు, ఆర్టీసీ కార్మికులు రత్నాకర్‌, సిపిఎం పార్టీ నాయకులు మట్టూరి స్టాలిన్‌,ఆటో యూనియన్‌ నాయకులు కంచుకో వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది.
బోనకల్‌ : మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి వేడుకలను సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు గోంగూర వెంకటేశ్వర్లు, మచ్చ గురవయ్య, ఏసు పోగు బాబు తదితరులు పాల్గొన్నారు.
వైరాటౌన్‌ : దేశంలో ఆధిపత్యంలో ఉన్న కుల, మత, మితవాద రాజకీయాలను తిరస్కరించి శ్రామిక ప్రజా ఉద్యమాలను నిర్మించడమే సుందరయ్యకు ఘన నివాళులని ప్రముఖ విద్యావేత్త ఐవి రమణ రావు, సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. శుక్రవారం వైరా బోడెపుడి భవనంలో చింతనిప్పు చలపతిరావు అధ్యక్షతన సుందరయ్య 38వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి బొంతు సమత, సిపిఐ(ఎం) మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, మల్లెంపాటి రామారావు, పారుపల్లి కష్ణారావు, పారుపల్లి శ్రీనాధ్‌, వాసిరెడ్డి విద్యా సాగర్‌ రావు, పైడిపల్లి సాంబశివరావు, బెజవాడ వీరభద్రం, గుమ్మా నరశింహరావు, పాపగంటి రాంబాబు, సంక్రాంతి పురుషోత్తం, తోట కృష్ణవేణి, వడ్లమూడి మధు, శీలం నారాయణ రెడ్డి, మాడపాటి రామారావు, ఓర్సు సీతారాములు, నరసింహచారి పాల్గొన్నారు.
వేంసూరు: సిఐటియు ఆధ్వర్యంలో సుందరయ్య వర్ధంతిని మర్లపాడులో జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సాదు శరత్‌ బాబు, గౌరీ శంకర్‌, డాంకర శ్రీను, యాకూబ్‌, రామాచారి శివశంకర్‌ చరణ్‌ పాల్గొన్నారు
కామేపల్లి : కామేపల్లి మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో సుందరయ్య వర్థంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ, పార్టీ మండల కార్యదర్శి అంబటి శ్రీనివాస్‌రెడ్డి, మండల నాయకులు బాధావతు శ్రీనివాస్‌, శాంతయ్య, భాస్కర్‌, మేడ నాగేశ్వరరావు, సత్తిరెడ్డి, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.
చింతకాని : పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా సిపిఐ(ఎం) మండల పార్టీ కార్యాలయంలో, బస్వాపురం గ్రామంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) చింతకాని మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, పార్టీ మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకిరాములు,గడ్డం రమణ,దేశబోయిన ఉపేందర్‌, గడ్డం కోటేశ్వరరావు పాల్గొన్నారు.
బోనకల్‌ : అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య పోరాట స్ఫూర్తితో ప్రతి కార్యకర్త ఉద్యమాలు నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌ కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు కోరారు. మండల పరిధిలోని ముష్టికుంట్ల, గోవిందపురం ఎల్‌ గ్రామాలలో అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి వేడుకలను సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, కొంగర వెంకట నారాయణ, పిల్లలమర్రి అప్పారావు, బోయినపల్లి కోటేశ్వరరావు, షేక్‌ నజీర్‌, పిల్లలమర్రి నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బంధం శ్రీనివాసరావు, సిపిఎం మండల కమిటీ సభ్యులు కందికొండ శ్రీనివాసరావు, దొప్ప కొరివి వీరభద్రం, సిఐటియు మండల కన్వీనర్‌ బోయినపల్లి వీరబాబు పాల్గొన్నారు.

Spread the love