నవతెలంగాణ-భద్రాచలం రూరల్
భద్రాచలం గ్రామదీపికల న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం నెరవేర్చేంతవరకు పోరాటం ఆగేది లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కొలగాని బ్రహ్మచారి, పట్టణ కన్వీనర్ ఎంబీ నర్సారెడ్డి స్పష్టం చేశారు. గ్రామ దీపికల 33వ రోజు దీక్షలను ప్రారంభించిన వారు మాట్లాడుతూ గత 33 రోజులుగా ఎర్రటి ఎండల్లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నటువంటి వీవోఏలను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, దీనికి తగిన మూల్యం ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగరాజు, లక్ష్మణ్, మురళీకృష్ణ, వెంకట్, చంద్రలీల, వెంకటలక్ష్మి, సీతారత్నం, జానకి, తదితరులు పాల్గొన్నారు.