బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఖరారు

 సిఐటియు జేబిసిసిఐ సభ్యులు మంద
నవతెలంగాణ-కొత్తగూడెం
కోల్‌ కత్తాలో ఈనెల 19,20 తేదీల్లో జరిగిన 11వ జేబిసిసిఐ, 10వ సమావేశంలో యాజమాన్యానికి 5 జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్‌ టియుసి, సిఐటియు, ఎచ్‌ఎంఎస్‌, బిఎంఎస్‌తో కుదిరిన ఒప్పందం. అన్ని కార్మిక సంఘాలు అంగీకరించి సంతకాలు చేశాయని. సిఐటియు జేబిసిసిఐ సభ్యులు మంద నరసింహారావు తెలిపారు. కలకత్తాలో జరిగిన ఒప్పంద వివరాలను ఆయన వెల్లడించారు. అన్ని అలవెన్స్‌లలో 25 శతం పెంచటానికి అంగీకారం కుదిరింది. జీతాన్ని లెక్కించేటప్పుడు పైసలల్లో కాకుండా రూ. 10 రౌండింగ్‌ ఆఫ్‌ చేయటానికి అంగీకరించారని, అండర్‌ గ్రౌండ్‌ అలవెన్స్‌ ఫ్రీజింగ్‌ తో 9శాతం నుండి 11.25 శాతం పెంచారని తెలిపారు. 4 శాతం స్పెషల్‌ 5 శాతం ఫ్రీజింగ్‌తో పెంచారన్నారు. 2శాతం హెచ్‌ఆర్‌ఏ ను 2.5 శాతం ఫ్రీజింగ్‌ తో పెంచారు. మున్సిపల్‌, కార్పొరేషన్‌, మెట్రోపాలిటీ సిటీలకు 9 శాతం, 18 శాతం, 27 శాతం సెంట్రల్‌ గవర్నమెంట్‌ రూల్స్‌ ప్రకారము చెల్లిస్తారని తెలిపారు. ఈ మూడు అలవెన్స్‌ లను ఫ్రీజింగ్‌ తో 25 శాతం పెంచుకోవడం ఎక్కువ లాభదాయకంగా ఉంటుందన్నారు. వాషింగ్‌ అలవెన్స్‌ 150 నుండి రూ.187.50లక, నర్సింగ్‌ వాషింగ్‌ అలవెన్స్‌ రూ.175ల నుండి రూ.218.75 లకు పెంచారు. ట్రాన్స్‌ పోర్ట్‌ సబ్సిడీ రూ.23 నుండి రూ. 28.75 కి పెంచారు. నైట్‌ షిఫ్ట్‌ అలవెన్స్‌ రూ.35 నుండి రూ.50కి పెంచారు. కన్వెనెన్స్‌ అలవెన్స్‌ రూ.50 నుండి రూ.62.50పై పెంచారు. నర్సింగ్‌ అలవెన్స్‌ రూ.400ల నుండి రూ.500 పెంచారని వివరించారు.
లీవులు వివరాలు తెలిపారు
సిక్‌ లీవ్‌ ఎక్యుమిలేషన్‌ 120 నుండి 150 పెంచారు. విత్‌ ఫె లీవు ఎక్కుమినేషన్‌ 150 నుండి 160కి పెంచారు. క్వారంటైన్‌ లీవ్‌ను పూర్తి వేతనంతో పూర్తి కాలానికి చెల్లిస్తారు. పెటర్నరీ లివ్‌ ను 5 రోజులు (భర్తకు) ఇస్తారు. ఇది ఇద్దరు పిల్లల తండ్రికి మాత్రమే వర్తిస్తుందన్నారు. స్టడీ లీవ్‌ లాస్‌ ఆఫ్‌ పే లీవ్‌ కింద శాంక్షన్‌ చేస్తారు. డిపెండెంట్‌ నిర్వచనాన్ని పునఃపరిశీలించడానికి, దానిని సవరించడానికి స్టాండ్‌ ర్డై నేషన్‌ కమిటీకి సూచించబడింది. అనాథ పిల్లలలో పెద్ద బిడ్డకు 18 ఏండ్లు వరకు తల్లి 50 శాతం ద్రవ్య ప్రయోజనం లభిస్తుందని, పెట్రోలు అలవెన్స్‌ కారు ఉన్న వారికి కూడా ఇవ్వటానికి అంగీకరించారన్నారు. ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతి రోజు అదనంగా ఒక్క సెలవు దినం ఇస్తారు. ఎల్‌టిసి రూ.8000ల నుండి రూ.10000లకు ఎల్‌ ఎల్టిసి రూ.12000ల నుండి రూ.15000లకు పెంచుతారని, వర్క్‌ మెన్‌ కాంపెన్సేషన్‌ 25 శాతానికి పెంచుతారు. లైఫ్‌ కవర్‌ స్కీంను 25 శాతానికి పెంచుతారని తెలిపారు. లివరు సిర్రోసిస్‌ జబ్బు, కంటి చూపు మొత్తం పోయినవారికి క్రిటికల్‌ డిసీజెస్‌ కింద పరిగణించటానికి స్టాండర్డై జేషన్‌ కమిటీలో చర్చిస్తారు. ద్రవ్య పరిహారంలో డిపెండెంట్‌ నిర్వచనాన్ని పునఃపరిశీలించడానికీ, దానిని సవరించడానికి స్టాండర్డై జేషన్‌ కమిటీకి సూచించబడింది. ఐఐఎంలో ఎంపిక కాబడిన ఉద్యోగికి స్టడీ లీవ్‌ ఇవ్వటానికి అంగీకరించారని చెప్పారు. డిపెండెంట్‌ ఎంప్లాయిమెంట్‌ విషయంలో స్టాండర్డై జేషన్‌ కమిటీ మీటింగ్‌లో చర్చించటానికి అంగీకరించారని, అనాధ పిల్లలు ఉన్న వారికి కూడా ఎంఎంసీ సౌకర్యము 18 సంవత్సరాలు వచ్చేంతవరకు క్యాటగిరీ వన్‌ బేసిక్‌లో 50 శాతం ఇవ్వటానికి అంగీకరించారు. ఏమైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే స్టాండర్డై జేషన్‌ కమిటీలో చర్చించడానికి మేనేజ్మెంట్‌ ఒప్పుకున్నదని వివరించారు. క్రొత్త జీతం జూన్‌ నెల నుండి కట్టిస్తారు. ఏరియర్స్‌ వారివారి కంపెనీ లను బట్టి చెల్లింపు చేస్తారని మంద నరసింహరావు తెలిపారు.

Spread the love