సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
కాడిగళ్ల భాస్కర్
పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్థంతి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
సుందరయ్య స్ఫూర్తితో భవిష్యత్తు ఉద్యమాలు నిర్వ హించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ పిలుపునిచ్చారు. పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్థంతిని పురష్కరించుకుని ఇబ్రహీంపట్నంలోని పాషా, నరహరి స్మారక కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. దక్షిణ భారత భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మా తల్లో ముఖ్యుడన్నారు. అనేక ప్రజా పోరాటాలు నిర్వహించి పరిష్కారం చూపిన నిస్వార్ధ కమ్యూనిస్టు నాయకుడన్నారు. కులరహిత, పేదలు లేని సమాజం కోసం కలలుకన్నా అవి శ్రాంత పోరాట యోధుడని కొనియాడారు. ఆశయమా ర్గంలో నడవడమే సీపీఐ(ఎం) కార్యకర్తలుగా మనం సుం దరయ్యకు అర్పించే నిజమైన నివాళ్లులన్నారు. నేటి పాల కులు ప్రజాసమస్యలు పక్కన పెట్టి పదవులే ఎజెండగా పని చేస్తూ ప్రజా సంక్షేమాన్ని విష్మరిస్తున్నారన్నారు. కుల, మతాలకు అతీతంగా భూస్వామ్య వ్యవస్థను బద్ధలు కొట్టి విశాలాంధ్రలో ప్రజారాజ్యాన్ని స్థాపించడంలో అగ్రభాగాన నిలిచిన ఉద్యమ రథసారథి అని కొనియాడారు. నేడు రాజ కీయ నాయకులు ప్రజలను అమాయకుల్ని చేసి వారి శ్రమ ను దోచి పెట్టుబడిదారి విధానాన్ని పెంచి పోషిస్తున్నాయ న్నారు. అవినీతి రాజ్యమేలుతున్న ఈ సమాజాన్ని మార్చే బాధ్యత ప్రతి కమ్యూనిస్టు కార్యకర్తపై ఉందన్నారు. కూడు, గూడు, గుడ్డకు, ఆర్థికంగా, ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారి సమస్యలు పరిష్క రించడం లోపాలకులు విఫలమయ్యారని విమర్శించారు. కార్యక్రమం సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పి.జంగారె డ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సామెల్, జగదీష్, కవిత, ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి సీహెచ్ జంగయ్య, మున్సిపల్ కార్యదర్శి ఎల్లేశ, మండల నాయకులు వేం కటేశ, పురుషోత్తం, శంకర్, స్వప్న, ముసలయ్య, వీరేష్, రామకృష్ణారెడ్డి, యాదగిరి, కళమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు.