సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహానీయుడు పుచ్చలపల్లి

పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్థంతి కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని పలువురు గుర్తు చేశారు. సుందరయ్య గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని స్పష్టీకరించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై.. పుచ్చలపల్లి స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా పలుచోట్ల రోగులకు పండ్ల పంపిణీ, రక్తదానం లాంటి కార్యక్రమాలను చేపట్టారు.
నవతెలంగాణ-ఐడిఏబొల్లారం
సామాజిక న్యాయం సాధించడమే ద్వారానే దేశం అభివద్ధి చెందుతుందని, అందుకే కులం, మతం, ప్రాంతీయలను పక్కనపెట్టి అందరూ ఐక్యంగా ఉండాలని, సోషలిజంలోనే ప్రజా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే.రాజయ్య అన్నారు. బొల్లారంలో నిర్వహించిన పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్థంతి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలు కులా లు, మతాల, ప్రాంతాల పేరు మీద విడిపోవడం, వివక్షత పాటించడం వల్లనే ప్రజల అభివద్ధి సాధ్యం కావట్లేదన్నారు. భారతదేశంలో కులం పూర్తిగా అంతమైతేనె, సామాజిక న్యా యం వర్ధిల్లుతనే దేశం ముందుకు పోతుందన్నారు. పాలకులు రోజురోజుకు కులాలను, మతాలను, ప్రాంతాలను రెచ్చ గొడుతున్నారని, సెంటిమెంట్‌ రెచ్చగొట్టి అధికారాన్ని కాపా డుకుంటున్నారని ఇటువంటి శక్తులపట్ల ప్రజలు జాగ్ర త్తగా ఉండాలన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో వాటిపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుసూదన్‌రెడ్డి, టీఐడిసి నాయకులు చంద్రశే ఖర్‌, సుధా కర్‌గౌడ్‌, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు ముత్యాలు, బుజ్జమ్మ, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్‌ : పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శమని, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్‌ అన్నారు. నేటి రాజకీయాల్లో పదవికాంక్షే తప్ప ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన నాయ కులకు లేదన్నారు. సీపీఐ(ఎం) ఖేడ్‌ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య 38వ వర్ధంతిని సీఐటీయూ కార్యాలంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అతిమేల మానిక్‌ మాట్లాడుతూ.. పుచ్చలపల్లి సుందరయ్య అందరికీ ఆదర్శవంతమైన నాయ కుడన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి పెరిగిన సుంద రయ్య తన చిన్నతనంలోనే భూస్వామ్య విధానాలను వ్యతిరే కిస్తూ పేదలు, వ్యవసాయ కార్మికులతో, కూలీలతో కలిసిపో యాడన్నారు. సుందరయ్య కేవలం భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఉద్యమ నిర్మాతగానే కాకుండా ప్రజల కోసం చివరి శ్వాస వరకు జీవించిన నేతగా గొప్ప పార్లమెంట్లో మంచి వక్తగా ప్రజలు నేటికీ గుర్తిస్తారన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఖేడ్‌ ఏరియా కమిటీ కార్యదర్శి చిరంజీవి నాయకులు కొటారి నర్సింలు, రమేష్‌, కాన్సిరాం, సంజీవ్‌,శంకర్‌, రాజ్‌ కుమార్‌ తది తరులు పాల్గొన్నారు.
పటాన్‌చెరు : సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య అని శాండ్విక్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పాండురంగా రెడ్డి అన్నారు. పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్‌ పరిశ్రమ ఎదుట సుందరయ్య 38 వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాండురంగా రెడ్డి సుందరయ్య చిత్రపటానికి పూలమాల సమర్పించి నివా ళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సు ందరయ్య అజాత శత్రువని, నిరాడంబరుడని, ప్రజల మనిషి అని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలకు దిక్సూచి సుందరయ్య సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరా డారని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయ కత్వం వహించారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు మనోహర్‌, వీరారావు, వెంకట్రావు, సదాశివరెడ్డి, ఎస్‌. త్రిలోచన్‌కుమార్‌, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సంగారెడ్డి : నిత్య స్ఫూర్తి ప్రధాత పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యురాలు మద్దూరి లక్ష్మి అన్నారు. అస్తాబల్‌లో ఏర్పాటుచేసిన సుందరయ్య వర్థంతి కార్యక్రమంలో పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించి.. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ.. కుల రహిత సమాజం కోసం తన పేరు చివర ఉన్న రెడ్డి అనే పదాన్ని తొలగిం చారన్నారు. ప్రజా సేవకు పిల్లలు అడ్డం అవుతారని బావించి పిల్లలు కాకుండా ఆపరేషన్‌ చేపించుకొన్న ఆదర్శ జంట సుం దరయ్య, లీలావతి అని కొనియాడారు. తన చివరి శ్వాస వరకు ప్రజల కోసం పోరాటం చేసిన యోధుడన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలరాజ్‌ కిరణ్‌ కుమార్‌, మహే ష్‌ కుమార్‌, శివకుమార్‌, మురళి, దుర్గాప్రసాద్‌, చంద్రశేఖర్‌, మహేందర్‌రెడ్డి, వెంకట్‌, చలపతిరావు పాల్గొన్నారు.
కంది : మండలంలోని కాశీపూర్‌ గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయ కులు పి.అశోక్‌ మాట్లాడుతూ.. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఆదర్శవం తమైందన్నారు. భారత దేశ మొదటి ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన వ్యక్తి అన్నారు. తన జీవి తాంతం పేద ప్రజలు,వ్యవసాయ, కార్మికులు, రైతుల పక్షాన పోరాటం చేసిన మహానేత అని అన్నారు. ఆ పార్టీ నాయకులు కుమార్‌, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్‌ : సుందరయ్య జీవిత చరిత్ర నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రామచంద్రం అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాంచందర్‌ మాట్లాడుతూ.. కామ్రేడ్‌ సుందరయ్య జీవితం సర్వస్వం ప్రజల కోసం, ప్రజల కోసం ప్రజా ఉద్యమాల కోసం ధారపోసారన్నారు. జీవితాంతం ప్రజాసేవకే అంకితం కావాలని సుందరయ్య, తన భార్య లీలా నిర్ణయించుకొని పిల్లలు కాకుండా ఆపరేషన్‌ చేసుకున్న గొప్ప ఆదర్శవంతుల న్నారు. పార్లమెంటుకు, అసెంబ్లీకి సైకిల్‌ పై వెళ్లిన గొప్ప త్యాగశీలి అన్నారు. పార్టీ నాయకులు మహిపాల్‌, సలిమోద్దీన్‌, మూతబీర్‌, పాహిమ్‌, బక్కన్న, బిక్షపతి, లక్ష్మణ్‌, నరేష్‌, బాలరాజు తుల్జారామ్‌, బాకన్న, యాదవ్‌, శ్రీనివాస్‌, సుకుమార్‌, రాజు, శాంతమ్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
సదాశివపేట : సదాశివపేట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభలో పార్టీ సదాశివపేట ఏరియా కార్యదర్శి వి ప్రవీణ్‌ కుమార్‌ మాట్లా డుతూ.. పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను, లక్ష్యాలను ముందుకు తీసుకు పోవడంలో కషి చేస్తామన్నారు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు సుందరయ్య అని అన్నారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపిన మహా నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులుఖయ్యూం, మల్లేశం, ఆంజనేయులు, శివకుమార్‌, సఫియా బేగం, బిస్మిల్లా, అమీనా తదితరులు పాల్గొన్నారు.
ఝరాసంగం : మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌ వద్ద జెండా ఎగురవేసి పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతిని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూల మా లలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి కె చంద్రన్న మాటాలడుతూ.. దేశంలో కార్మికుల, కూలీల సంగం ఏర్పాటు చేసి సైకిల్‌ పై పార్లమెంటుకు వెళ్లే ఏకైక వ్యక్తి సుందరయ్య అని కొనియాడారు. అనునిత్యం ప్రజల కోసం పోరాడి ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్‌, శివప్ప, నాగయ్య, అశోక్‌,మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love