మహిళా రెజ్లర్స్‌ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎంపీని వెంటనే అరెస్టు చేయాలి

నవతెలంగాణ-పరిగి
మహిళా రెజ్లర్స్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీని వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య డిమాండ్‌ చేశారు. దేశంలోని అగ్రశ్రేణి మహిళల రేజర్లపై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ బ్రీజ్‌ భూషణ్‌ శరన్‌ సింగ్‌ వెంటనే అరెస్టు చేసి, పార్లమెంట్‌ సభ్యత్వం రద్దు చేయాలని గురువారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పరిగి పట్టణంలో రేజర్లకు మద్దతుగా, బిజెపి ఎంపీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడుగురి మహిళా రేజర్లతో సహా ఒక మైనర్‌ రెజ్లర్‌ పై లైంగిక వేధింపుల పాల్పడిన బీజేపీ ఎంపీ భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రీజ్‌ భూషణ్‌ శరన్‌ సింగ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద 24 రోజులుగా రెజ్లర్స్‌ ఆందోళన చేస్తుంటే ప్రధానమంత్రి మోడీ రేపిస్టులకు మద్దతుగా నిలువడం సిగ్గుచేటు అన్నారు. కనీసం నేటి వరకు రేపిస్ట్‌ ఎంపీపై మోడీ నోరు మెదపడం లేదన్నారు. లైంగిక నేరస్తులకు ఆశ్రయం కల్పించి బిజెపి నీచమైన పాలనకు పాల్పడుతున్నదని విమర్శించారు. బిజెపి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నదని ఇది దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు ఆడి దేశానికి మంచి పేరు తీసుకొస్తున్న అలాంటి మహిళ రెజ్లర్స్‌ కె రక్షణ లేకుంటే సామాన్య ప్రజానీకానికి మహిళలకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం బ్రిజ్‌ భూషణ్‌ శరన్‌ సింగ్‌ను వెంటనే అరెస్టు చేసి ఎంపీ పదవి, సభ్యత్వాన్ని రద్దు చేయాలని, లేకపోతే దేశవ్యాప్తంగా కలిసిచ్చే సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు యాదగిరి, రాంచెంద్రయ్య, ఎల్లప్ప, ప్రశాంత్‌,నర్సింహా, గోరెమియా, శ్రీకాంత్‌, ప్రభు, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love