మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చెయ్యాలి: సీపీఐ(ఎం)

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
గత ప్రభుత్వం తెచ్చిన జీ ఓ నెంబర్ 51ద్వారా, పంచాయితీ కార్మికులకు గుదిబండగా మారిన  మల్టీ పర్పస్ విధానాన్ని  రద్దు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని, సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు  ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో పారిశుధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయితీల్లో పారిశుద్ధ్య కార్మికులు, స్విపర్లు, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్ లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్లుగా, వివిధ కేటగిలలో విధులు నిర్వహిస్తున్నారని, గత బిఅర్ స్  ప్రభుత్వం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మెంట్ చేస్తామని, ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, జి ఓ 51ద్వారా మల్టీ పర్పస్ విధానాన్ని తెచ్చి, ఉద్యోగాలకు భద్రత లేకుండా చేయటమే కాక, కేటగిరిలను రద్దు చేసి, అనుభవం లేని రకరకాల పనులను వారితో చేయించడం వల్ల, కార్మికులు ప్రమాదాలకు గురై, ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద కుటుంబాల వారే గ్రామ పంచాయితీ కార్మికులుగా  పనిచేస్తున్నారని, నెలలు గడచిన వేతనాలు రాక ఆర్దికంగా చాల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి, తమ సమస్యలు పరిష్కరించాలని, గత ప్రభుత్వ కాలంలో 34 రోజులు సమ్మె చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్న  ప్రభుత్వం, గ్రామ పంచాయితీ కార్మికులకు సమస్యగా మారిన మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, ప్రభుత్వ జీ ఓ ప్రకారం, ప్రతి నెల వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి,  వారి సమస్యలు పరిష్కారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కారోబార్ మర్రిపల్లి కృష్ణ, పంప్ ఆపరేటర్, కొంపల్లి మురళి,  పారిశుద్ధ్య కార్మికులు కొంపల్లి సోమయ్య, కొంపల్లి రాజేశ్వరి, కొంపల్లి అంజయ్య లు పాల్గొన్నారు.
Spread the love