భారత రాజ్యాంగం గురించి తెలుసుకొని భవిష్య త్తును చక్కదిద్దుకొవాలి

– డీబీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు
నవతెలంగాణ – తొగుట
భారత రాజ్యాంగం గురించి తెలుసుకొని భవిష్య త్తును చక్కదిద్దుకొవాలని డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు తెలిపారు. శనివారం మండలంలోని వెంకట్రావుపేట ఉన్నత పాఠశాల లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, సావిత్రి బాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని డిబిఎఫ్ ఆద్వర్యంలో వ్యాసరచన పోటిలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలై 74 సంవత్సరాలవుతున్న నేటికీ చాలామందికి రాజ్యాంగం గురించి తెలియ క పోవడం బాధాకరం అన్నారు. 1950 జనవరి 26 న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలు లోకి వచ్చిందన్నారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చలు, నిర్ణయాల ద్వారా రాశారన్నారు. 1946 నుండి 1949 వరకూ ఈ బృందం భారత పార్ల మెంటు హాలులో సమావేశమై చర్చలు చేశారని తెలిపారు. జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఇటువంటి విషయా లు విద్యార్థులు తెలుసుకొని రాజ్యాంగం లొని 22 విభాగాలను,395 ఆర్టికల్ లను తెలుకొని నైపు న్యాన్ని పెపొందించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love