
– మాజీ జిల్లా గ్రంథాలయ, జెడ్పీటీసీ బీఆర్ఎస్ కు రాజీనామా
నవతెలంగాణ – నసురుల్లాబాద్
నిర్బంధ పాలన నుంచి బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మాజీ జెడ్పిటిసి దివిటీ కిషోర్ యాదవ్, మాజీ జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ డి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం నసరుల్లాబాద్ మండలంలోని అంకోల్ క్యాంప్ శివారు లోని దివిటీ శ్రీనివాస్ యాదవ్ ఫామ్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. నసురుల్లాబాద్ మండలంలోని హాజీపూర్, అంకోల్ తండా, నెమ్లి , దుర్కి, మిర్జాపూర్ తదితర గ్రామాల నుంచి సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, దూర్కి పలు సొసైటీ డైరెక్టర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈనెల 5వ తేదీన బాన్సువాడ పట్టణంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వాళ్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ దుర్గి సొసైటీ అధ్యక్షులు దివిటి శ్రీనివాస్ యాదవ్ మాజీ జెడ్పిటిసి కిషోర్ యాదవ్ మాట్లాడుతూ 2018 లో కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళామని అక్కడి నుంచి ఇప్పటి వరకు స్వచ్ఛందంగా పార్టీకి కట్టుబడి పని చేసి రెండు పర్యాలు ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించామన్నారు. బాన్సువాడ నియోజకవర్గం లో పోచారం నిర్బంధ పాలన కొనసాగుతుందని కార్యకర్తలు సామాన్య ప్రజలు ఒక ఎమ్మెల్యే తో మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందన్నారు . నేరుగా ఎమ్మెల్యేని కలిసే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు విరక్తి చెంది నిర్బంధ పాలను వదిలేసి ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని వారు అన్నారు. ఐదవ తేదీన నసురుల్లాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు నాయకులు పార్టీకి రాజీనామా చేసిన వారితో నస్రుల్లాబాద్ మండల కేంద్రం నుండి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీతో వెళ్లి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ నెంబర్ ముస్తఫా హుస్సేన్ దొరికి ఎంపిటిసి డాక్టర్ నారాయణ, హాజీపూర్ , అంకొల్ తండా మాజీ సర్పంచ్ లు అరిగే అంజయ్య, బద్యా నాయక్, కదిర్, శ్రీనివాస్, గంగాధర్, ఇక్బాల్, తదితరులు పాల్గొన్నారు.