నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
2023-24 విద్యా సంవత్సరంలో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ జూనియర్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షా ఫలితాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ , బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి. వెంకటేశం సోమవారం విడుదల చేసినట్టు ఆ సంస్థ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు తెలిపారు. ఈ ఫలితాల్లో ఎంపీసీలో 150 మార్కులకుగాను 122 మార్కులతో మొదటి స్థానంలో సిద్ధిపేట జిల్లాకు చెందిన పి. జ్యోత్స్న, బైపీసీలో నల్గొండ జిల్లాకు చెందిన పి.శ్రీవల్లి 108 మార్కులతో, సీఈసీలో పెద్దపల్లి జిల్లాకు చెందిన కె.సాయి సంహిత 107 మార్కులతో, ఎంఈసీలో మేడ్చల్ జిల్లాకు చెందిన ఎ. అర్చన 109 మార్కులతో అగ్ర స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. జూన్ ఒకటి నుంచి పదో తేదీ వరకు విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో చేరాలని సూచించారు. ఫలితాలను https://mjptbcwreis. telangana.gov.in వెబ్ సైట్‌లో చూసుకోవచ్చని మల్లయ్య బట్టు తెలిపారు.