శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

నవతెలంగాణ – రామారెడ్డి
పలువురిని పరామర్శించిన మదన్మోహన్రావు ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు కల్వకుంట్ల మదన్మోహన్రావు మంగళవారం మండలంలోని ఇస్సన్నపల్లి రామారెడ్డి లో వెలిసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పూజారులు శాలువాతో సన్మానించి, తీర్థ ప్రసాదాలు, స్వామివారి జ్ఞాపికను అందజేశారు. అనంతరం రామారెడ్డి తో పాటు కన్నాపూర్ లో ఇల్లు దగ్ధమవడం, పలువురు మృతి చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించారు. కన్నాపూర్ వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ రవీందర్ రావు, గిద్ద ఎం పి టి సి ప్రవీణ్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మా గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి, నామాల రవీందర్, తూర్పు సుబ్బన్న, తూర్పు రాజు, పరశురాం, బి పేట నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love