తాగునీటికి దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు

– జోన్‌లోని 170 స్టేషన్లలో 468 వాటర్‌ కూలర్లు
– డివిజనల్‌ స్థాయిలోనూ నిరంతర పర్యవేక్షణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
దక్షిణ మధ్య రైల్వే వేసవికాలం నేపథ్యంలో ప్రయాణీల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.తమ నెట్‌వర్క్‌లోని అన్ని స్టేషన్లలో తాగునీటిని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నది.వేసవి కాలం,అధిక వడ గాల్పుల వీస్తున్న తరుణంలో జోన్‌వ్యాప్తంగా తాగునీటి అవసరాలపై దృషిపెట్టింది.ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నది.తద్వారా రైలు ప్రయాణీకు లకు అవసరమైన మేరకు తాగు నీరు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలుచ చేపట్టింది.అధికారులు, సిబ్బంది బందాలుగా ఏర్పాటు చేసి, నిబంధనలకు అనుగుణంగా ప్రయాణీకులకు స్వచ్ఛమై న తాగునీటిని అందించడానికి మండల, డివిజనల్‌ స్థాయిల్లో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల పర్యవేక్షకులతో సంయుక్త సమావేశాలు నిర్వహిస్తున్నారు తద్వారా అన్ని స్టేషన్లలోనూ నీటి అవసరా లు,సరఫరా తదితర అంశాలపై సమీక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఉత్పన్నమైతే ఇబ్బంది రాకుండా ముందస్తుగా అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలోని 170 స్టేషన్లలో ఇప్పటికే 468 చల్లటి నీటి కూలర్లు అందుబాటులోకి తెచ్చారు.
డివిజనల్‌ సెంట్రల్‌ కంట్రోల్‌ ఆఫీస్‌ ద్వారా 24 గంటలు పర్యవేక్షణా వ్యవస్థను సైతం ఏర్పాటు చేశారు.సమస్య తలెత్తితే కేంద్ర నియంత్రణ ద్వారా సంబంధిత సూపర్‌వైజర్ల ద్వారా చర్యలు తీసుకుంటున్నారు.నాణ్యమైన నీటి సరఫరా కోసం ఎప్పటికప్పుడు పరీక్షలు సైతం నిర్వహిస్తున్నారు.వేగంగా నీటి సరఫరా జరిగేలా చూస్తున్నారు.
ప్రధాన స్టేషన్లల్లో తాగునీరు ఎక్కువగా అందు బాటులో ఉంచుతు న్నారు.స్టేషన్లలోని నీటి కుళాయిల మరమ్మత్తులు సైతం యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు.ఇందుకోసం ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేశారు. ప్లాట్‌ఫారాల్లోని కుళాయిలపై పర్యవేక్షణ ఉంటుంది.మంచినీళ్లు అందుబా టులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఇతర ప్రదేశాలలో, అన్ని నిల్వ ట్యాంకుల్లో తగిన నీటి లభ్యతను నిర్ధారించడానికి నిరంతరం పర్యవేక్షించ బడుతున్నాయి.భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఆయా స్టేషన్లలో ఏర్పాటు చేసిన వర్షపు నీటి గుంతలను కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈమేరకు శనివారం రైల్వే శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

Spread the love