మూడు వేదికల్లో చాంపియన్స్‌ ట్రోఫీ!

మూడు వేదికల్లో చాంపియన్స్‌ ట్రోఫీ!– ఐసీసీకి పీసీబీ ముసాయిదా ప్రణాళిక
కరాచీ : 1996 తర్వాత ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్న పాకిస్థాన్‌.. 2025 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీని మూడు వేదికల్లో నిర్వహిస్తామని ఐసీసీకి వెల్లడించింది. కరాచీ, లాహౌర్‌, రావల్పిండి వేదికగా అన్ని మ్యాచుల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసి ఐసీసీకి అందజేసింది. ముసాయిదా ప్రణాళికలో భారత మ్యాచులను సైతం పాక్‌ గడ్డపైనే షెడ్యూల్‌ చేశారు. పీసీబీ ప్రతిపాదిత ముసాయిదా ప్రణాళికపై రానున్న వార్షిక సమావేశంలో ఐసీసీ చర్చించనుంది. పాక్‌లో పర్యటించేందుకు భారత్‌ నిరాకరిస్తున్న తరుణంలో.. ఆసియా కప్‌ తరహాలో హైబ్రిడ్‌ మోడల్‌లో చాంపియన్‌ ట్రోఫీని నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా కప్‌లో భారత మ్యాచులకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వగా.. ఇతర మ్యాచులను పాకిస్థాన్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

Spread the love