కుల్దీప్‌ కేక..

Kuldeep cried..– లక్నోపై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు
లక్నో: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)లో తొలిసారి ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్‌రత్న శ్రీ అటల్‌బిహారి వాజ్‌పేయి ఏక్నా స్టేడియంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన లక్నోను స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌(3/20) స్పిన్‌ దెబ్బకు 20 ఓవర్లలో 167పరుగులకే పరిమితమైంది. ఆ లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 170 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఛేదనలో ఢిల్లీ ఓపెనర్‌ పృథ్వీ షా(32) రాణించినా.. స్టార్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌(8) నిరాశపరిచాడు. ఆ తర్వాత ఫ్రేజర్‌(55) అర్ధసెంచరీకి తోడు కెప్టెన్‌ పంత్‌(41)బ్యాటింగ్‌లో రాణించారు. వీరిద్దరూ 3వ వికెట్‌కు 77పరుగులు చేసి ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. ఆ తర్వాత హోప్‌, స్టబ్స్‌ మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. లక్నో బౌలర్లు బిష్ణోరుకు రెండు, నవీన్‌, యశ్‌ ఠాకూర్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. డేంజరస్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(19), దేవ్‌దత్‌ పడిక్కల్‌(13)లను ఖలీల్‌ అహ్మద్‌ ఎల్బీగా పెవీలియన్‌కు చేర్చాడు. జట్టు స్కోర్‌ 28పరుగుల వద్ద లక్నో జట్టు తొలి వికెట్‌ కోల్పోయినా.. 77 పరుగులకే చేరేసరికి ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత రాహుల్‌, స్టోయినిస్‌తో ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేసినా.. చైనామన్‌ కుల్దీప్‌ వరుస బంతుల్లో మార్కస్‌ స్టోయినిస్‌(8), నికోలస్‌ పూరన్‌(0)లను ఔట్‌ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో కేఎల్‌ రాహుల్‌(39)ను పెవిలియన్‌ పంపి లక్నోను పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఇషాంత్‌ శర్మ ఓవర్లో దీపక్‌ హుడా(10) వెనుదిరిగాడు. కృణాల్‌ పాండ్యా కూడా నిరాశపరచడంతో లక్నో జట్టు 94పరుగులకే 7వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. ఆ దశలో ఆయుష్‌ బడోని(65)మెరుపు అర్ధసెంచరీకి తోడు ఆర్షాద్‌ ఖాన్‌(20నాటౌట్‌) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 8వ వికెట్‌కు 73పరుగులు జతచేసి లక్నోజట్టు గౌరవప్రద స్కోర్‌ చేసేందుకు దోహదపడ్డారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌కు మూడు, ఖలీల్‌ అహ్మద్‌కు రెండు, ఇషాంత్‌, ముఖేశ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కుల్దీప్‌ యాదవ్‌కు లభించింది.
స్కోర్‌బోర్డు..
లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (ఎల్‌బి)ఖలీల్‌ అహ్మద్‌ 19, కెఎల్‌ రాహుల్‌ (సి)పంత్‌ (బి)కుల్దీప్‌ 33, దేవదత్‌ పడిక్కల్‌ (ఎల్‌బి)ఖలీల్‌ అహ్మద్‌ 3, స్టొయినీస్‌ (సి)ఇషాంత్‌ (బి)కుల్దీప్‌ 8, పూరన్‌ (బి)కుల్దీప్‌ యాదవ్‌ 0, దీపక్‌ హుడా (సి)వార్నర్‌ (బి)ఇషాంత్‌ 10, ఆయుష్‌ బడోని (నాటౌట్‌) 55, కృణాల్‌ పాండ్యా (సి)పంత్‌ (బి)ముఖేశ్‌ కుమార్‌ 3, ఆర్షాద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 20, అదనం 10. (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 167పరుగులు.
వికెట్ల పతనం: 1/28, 2/41, 66/3, 4/66, 5/77 6/89 7/94
బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4-0-41-2, ఇషాంత్‌ శర్మ 4-0-36-1, ముఖేశ్‌ కుమార్‌ 4-0-41-1, అక్షర్‌ పటేల్‌ 4-0-26-0, కుల్దీప్‌ యాదవ్‌ 4-0-20-3,
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి)పూరన్‌ (బి)బిష్ణోరు 32, వార్నర్‌ (బి)యశ్‌ ఠాకూర్‌ 8, ఫ్రేజర్‌ (సి)ఆర్షాద్‌ ఖాన్‌ (బి)నవీన్‌-ఉల్‌-హక్‌ 55, పంత్‌ (స్టంప్‌)రాహుల్‌ (బి)బిష్ణోరు 41, స్టంబ్స్‌ (నాటౌట్‌) 15, హోప్‌ (నాటౌట్‌) 11, అదనం 8. (18.1ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 170పరుగులు.
వికెట్ల పతనం: 1/24, 2/63, 3/140, 4/146
బౌలింగ్‌: ఆర్షాద్‌ ఖాన్‌ 3.1-0-34-0, నవీన్‌-ఉల్‌-హక్‌ 3-0-23-1, యశ్‌ ఠాకూర్‌ 4-0-31-1, కృనాల్‌ పాండ్యా 3-0-45-0, రవి బిష్ణోరు 4-0-25-2, స్టొయినీస్‌ 1-0-10-0
వరుసగా మూడోసారి ససెక్స్‌తో పుజరా ఒప్పందం
లండన్‌: టీమిండియా టెస్ట్‌ బ్యాటర్‌ ఛటేశ్వర పుజరా వరుసగా మూడో ఏడాది కౌంటీల్లో ససెక్స్‌ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. శుక్రవారం లిసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్‌ తరఫున 2024 సీజన్‌ను ప్రారంభించాడు. 2022 సీజన్‌లో ససెక్స్‌ తరఫున 18మ్యాచులు ఆడిన ఈ ఏడాది డివిజన్‌-1లో తొలి ఏడు మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలిపాడు. ఈ క్లబ్‌ తరఫున పుజరా గత రెండేళ్లలో 64.24యావరేజ్‌తో 1,863పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక 2023-24 రంజీ సీజన్‌లో సౌరాష్ట్ర తరఫున 13 ఇన్నింగ్స్‌లో 69.08 సగటుతో 829పరుగులు చేశాడు. గతంలో పుజరా డెర్భీషైర్‌, యార్క్‌షైర్‌, నాటింగ్హామ్‌టైర్‌లలోనూ ఆడిన అనుభవం ఉంది.

Spread the love