నవతెలంగాణ – నెల్లికుదురు
తెలంగాణ అభివృద్ధి చెందిందంటే అది కెసిఆర్ తోనే సాధ్యమైందని ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని మదనతూర్తి గ్రామంలో ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి తో కలిసి ఆ గ్రామ మాజీ సర్పంచ్ కొమ్ము అనిల్ అధ్యక్షతన ఉపాధి కూలీల వద్దకు వెళ్లి ఎంపీ అభ్యర్థి మాలోతు కవితను గెలిపించాలని శనివారం కోరే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ హాయంలో అన్ని రంగాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు తయారుచేసి కోట్లాది నిధులు తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి పరిచేందుకు కృషి చేసిన వ్యక్తి కేవలం కేసీఆర్ అని అన్నారు. అందరికీ న్యాయం జరిగే విధంగా కార్యక్రమాలను నిర్వహించారని అన్నారు. కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అన్ని పథకాలు అందరికి అందాయని అన్నారు. కానీ నేడు పథకాలను కూడా నడిపించలేని స్థితికి దిగజారుతున్నారని అన్నారు. పేదల అభివృద్ధి కోసం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని తెలిపారు. కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం శ్యామలంగా ఉండి నీరు సమృద్ధితో చెరువులు కుంటలు జలకళాలతో నిండుకుండలా ఉండి ఎక్కువ పంటలు పండి దిగుమతి వచ్చి రైతులు సంతోషంగా ఉన్నారని అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక చెరువుల ఎండి పోయి వేసిన పంటలు ఎండిపోయిన పరిస్థితి నెలకొన్నదని అన్నారు కాంగ్రెస్ ప్రజలకు చేసిన మేలు లేదని అన్నారు. ఈ ఆ గ్రామ మాజీ సర్పంచ్ కొమ్ము అనిల్ ఎంపీటీసీ ఇస్లావత్ దూడి నాయకులు ఆకుల జగ్గయ్య బొజ్జ నాయక్ మంద అశోక్ గోపగాని యాకన్న పనికిర భిక్షం పద్మావతి శ్రీను యాకన్న వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.