వేసవిలో ఆయిల్ ఫామ్ తోటలను కాపాడు కోవాలి 

– జిల్లా ఉజ్వన శాఖ అధికారి మర్రియన్న 
నవతెలంగాణ – నెల్లికుదురు 
ఈ వేసవి కాలంలో  ఆయిల్ ఫామ్ తోటలను రైతులు కాపాడుకోవాలని జిల్లా ఉజ్వల శాఖ అధికారి జినుగు మర్రియాన్న అన్నారు మండల కేంద్రంలో శనివారం మహబూబాద్ నెల్లికుదురు తొర్రూరు మండలంలో ఉన్న ఆయిల్ ఫామ్ తోటలను ఆ శాఖ అధికారి సిహెచ్ రాకేష్ తో కలిసి పరిశీలించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ నర్సరీల లో మరియు ఆయిల్ పామ్ తోటల లో  వేసవి యాజమాన్యం, కలుపు యాజమాన్యం, గ్రీన్ మ్యాన్యుర్ (పచ్చి రొట్ట ఎరువులు),అంతర్ పంటల గురించి, ఎరువుల వాడకం గురించి, పూ గుత్తులు తొలగింపు వంటి పలు సాంకేతిక సలహాలు సూచనలు చేశారు. అలాగే నూతన రైతులు పంట మార్పిడి చేసి, మార్కెట్ డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు, మల్బరీ తోటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  ఆయిల్ ఫెడ్ అధికారులు రాములు, ప్రశాంత్,రైతులు  శ్రీ నరసింహ రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love