మాజీ ఎమ్మల్యే శంకర్ నాయక్ జన్మ దిన వేడుకలు

– బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి 

– ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావ్ 
నవతెలంగాణ – నెల్లికుదురు
మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు బి ఆర్ ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు తెలిపారు. మండల కేంద్రంలో ఆ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి సోమవారం కేక్ కట్  చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మహబూబాద్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామం ప్రతి తండాను అభివృద్ధి చేసిన ఘనదానికి దక్కిందని అన్నారు. కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ప్రతి గ్రామానికి లింకు రోడ్లు వేయించారని అన్నారు. మహబూబాద్ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు ఆహారదీశులు కృషి చేశారని అన్నారు. ప్రకటించిన వెంటనే జిల్లా కేంద్రంలో విద్యా వైద్య రంగానికి పెద్ద పీట వేశారని అన్నారు. అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకను నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బత్తిని అనిల్ గౌడ్ శ్రీరామగిరి పీఏసీఎస్ వైస్ చైర్మన్ బోజ్య నాయక్ సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు భీముడు మాజీ సర్పంచ్ బిక్కు నాయక్ నాయకులు వెన్నాకుల శ్రీనివాస్ యాసం  రమేష్ పులి రామచంద్ర గొట్టిముక్కుల బాలాజీ నాయక్ వెంకటేశ్వర రెడ్డి సలుగు శ్రీనివాస్ కొమ్ము అనిల్ మంద అశోక్ బోల్లు మురళి కారం ప్రశాంత్ పిడుగు యాకన్న వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
Spread the love